iDreamPost

నా సినిమాను రీమేక్‌ చేశారని నాకే తెలియదు! వాటి అవసరం లేదు: పృథ్వీరాజ్‌

  • Published Mar 25, 2024 | 2:49 PMUpdated Mar 25, 2024 | 2:49 PM

Prithviraj Sukumaran: మలయాళంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్) అనే సినిమాలో హీరోగా నటించారు. అయితే ఆ సినిమా విడుదలకు తేదీ దగ్గరవుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ రీమేక్ మూవీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Prithviraj Sukumaran: మలయాళంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా 'ఆడుజీవితం' (ది గోట్ లైఫ్) అనే సినిమాలో హీరోగా నటించారు. అయితే ఆ సినిమా విడుదలకు తేదీ దగ్గరవుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ రీమేక్ మూవీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Published Mar 25, 2024 | 2:49 PMUpdated Mar 25, 2024 | 2:49 PM
నా సినిమాను రీమేక్‌ చేశారని నాకే తెలియదు! వాటి అవసరం లేదు: పృథ్వీరాజ్‌

మలయాళ హీరో ‘పృథ్వీరాజ్  సుకుమారన్’ గురించి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈయన ప్రభాస్ ‘సలార్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించారు. ఇక ఈ సినిమాలో ఈయన అద్భుతమైన నటనకు ప్రేక్షకల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పృథ్వీరాజ్ ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్) అనే సినిమాలో హీరోగా నటించారు. కాగా, ఆ సినిమా మార్చి 28న రిలీజ్ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి హైదరాబాద్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రీమీక్ సినిమాలపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మలయాళంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రలో అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పృథ్వీరాజ్ తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యరనే చెప్పాలి. అయితే తాజాగా ఆయన ఆడుజీవితం (ది గోట్ లైఫ్) అనే సినిమాలో నటించారు. కాగా, ఈ సినిమా ఈనెల అనగా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ అంతా కలిసి ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే పృథ్వీరాజ్ హైదరాబాద్‌లో కూడా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రీమేక్ సినిమాలపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందులో పృథ్వీరాజ్ సినిమాలైన అయ్యప్పన్ కోషియమ్, లూసిఫర్, ముంబై పోలీస్‌‌ సినిమాలు తెలుగులో కూడా రీమేక్ చేశారు. కాగా, ఈ మూడు చిత్రాలు భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్, హంట్ పేర్లతో తెలుగులో రీమేక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాలను మీరు ఎప్పుడైనా చూశారా అనే ప్రశ్న ఎదురైంది.

అందుకు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘నేను నటించిన ముంబై పోలీస్ తెలుగులో రీమేక్ చేశారనే విషయమే నాకు తెలీదు. ఇక భీమ్లా నాయక్ సినిమా అయితే నేను అసలు చూడలేదు. కాకపోతే కొన్ని సీన్లు మాత్రమే చూశాను. అలానే గాడ్ ఫాదర్‌లో కొన్న సీక్వెన్స్‌లు కూడా చూశాను. అయితే ఈ రెండు చిత్రాలు చూసే టైమ్ నాకు దొరకలేదు. పైగా ఆ సమయంలో నేను వేరే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. ఇక మరికొద్ది రోజుల్లో మనం రీమేక్ సినిమాలు చేసే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే.. ఉదాహరణకు ఆడుజీవితం సినిమా అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. కనుక ఇక మళ్లీ దీన్ని తెలుగులో తీయాల్సిన అవసరం లేదు . కనుక ఇక నుంచి భవిష్యత్తులో అన్ని చిత్రాలు అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతాయి. అందుకే రీమేక్‌లు ఇక ఉండవు’. అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

ఇక పృథ్వీరాజ్ ఆడుజీవితం సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిగా ఎడారిలోనే జరిగింది. బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ కేరళ యువకుడు అక్కడి ఎడారిలో చిక్కుకుపోతాడు. అక్కడ అతను పడిన బాధలు, అనుభవించిన వేదన, తిరిగి మాతృభూమికి వచ్చిన ప్రయాణం వంటి నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. అంతేకాకుండా.. వాస్తవిక సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.మరి, రీనేక్ సినిమాలపై పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి