iDreamPost

హైదరాబాద్: నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు తయారు చేసే ముఠా అరెస్టు!

Fake Mysore Sandle Soap: ఈ వార్త చాలామందికి నచ్చకపోవచ్చు. ఎదుకంటే వారికి ఎంతో ఇష్టమైన సబ్బును నకిలీ చేస్తున్నారు.

Fake Mysore Sandle Soap: ఈ వార్త చాలామందికి నచ్చకపోవచ్చు. ఎదుకంటే వారికి ఎంతో ఇష్టమైన సబ్బును నకిలీ చేస్తున్నారు.

హైదరాబాద్: నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు తయారు చేసే ముఠా అరెస్టు!

స్నానం అనేది అందరి జీవితంలో నిత్యకృత్యం. స్నానికి సంబంధించిన సోప్ విషయంలో గతంలోనైతే పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కావు. కానీ, ఇప్పుడు లెక్కకు మించిన కంపెనీలు, ఫ్రేగ్రెన్సులు, ఫార్ములాలతో కొత్త కొత్త సబ్బులను మార్కెట్లోకి దించేస్తున్నారు. అంతేకాకుండా వీపరీతమైన యాడ్స్ తో వాటిని కొనేలా ప్రభావితం చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని సబ్బులు ఏళ్ల తరబడి ఈ పోటీ మార్కెట్ ని ఏలేస్తున్నాయి. వాటిలో ప్రధానంగా వినిపించే పేరు మైసూర్ శాండిల్. నిజానికి ఈ సబ్బు చాలామంది ఎమోషన్ అనే చెప్పాలి. అది తప్పితే వేరే సోప్ వాడమన్నా వాడరు. అలాంటి సబ్బును కూడా కల్తీ చేశారు. నకిలీ మైసూర్ శాండిల్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ మైసూర్ శాండిల్ సబ్బుల తయారీ ముఠాను మలక్ పేట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఈ నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులను తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారం అందుకున్న మలక్ పేట పోలీసులు సోదాలు నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన తయారీ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన రాకేశ్ జైన్, మహావీర్ జైన్ లను నిందితులగా తేల్చారు. ఈ నకిలీ ముఠాకి సంబంధించిన సమాచారం కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ కు సమాచారం అందింది. వెంటనే ఆయన ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు జరపకగా ఈ నకిలీ ముఠా వెలుగులోకి వచ్చింది. అయితే మైసూర్ శాండిల్ సబ్బుకు కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కేఎస్ డీఎల్ అనే సంస్థకు పేటెంట్ హక్కులు ఉన్నాయి. కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ కేఎస్ డీఎల్ సంస్థకు ఛైర్మన్ గా ఉన్నారు. మరి.. నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు తయారు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి