iDreamPost

ఇదో అద్భుతం.. గాలి నుంచే నీటి తయారీ.. లీటర్ నీరు ఎంతో తెలుసా..?

  • Published Apr 24, 2024 | 2:53 PMUpdated Apr 24, 2024 | 2:53 PM

ప్రస్తుతం వేసవికాలం కావడంతో.. రైల్వే స్టేషన్ లో ఉండే ప్రయాణికులు మంచి నీరు కోసం అనేక ఇబ్బందులు పడుతుంటారు.  అలాంటి వారి కోసం తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అతి తక్కువ ధరకే మంచి నీటిని అందించే కొత్త ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేమిటంటే..

ప్రస్తుతం వేసవికాలం కావడంతో.. రైల్వే స్టేషన్ లో ఉండే ప్రయాణికులు మంచి నీరు కోసం అనేక ఇబ్బందులు పడుతుంటారు.  అలాంటి వారి కోసం తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అతి తక్కువ ధరకే మంచి నీటిని అందించే కొత్త ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేమిటంటే..

  • Published Apr 24, 2024 | 2:53 PMUpdated Apr 24, 2024 | 2:53 PM
ఇదో అద్భుతం..  గాలి నుంచే నీటి తయారీ.. లీటర్ నీరు ఎంతో తెలుసా..?

ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవ శరీరానికి ఆహారంతో పాటు మంచినీరు కూడా ఎంతో అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా మంచి నీటికి ఉన్న ప్రధాన్యత గురించి అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం వేసవి కాలంలో కావడంతో.. ఈ నీటి కొరత సమస్య అనేది ఎక్కడబడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ఉన్న ప్రయాణికులకు తాగాడానికి మంచి నీళ్లు దొరకకా చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీని వలన బయట షాపుల్లో ఎక్కువగా నగదు చెల్లించి మరి ఆ మంచి నీళ్లను కొనుక్కుంటారు. ఇక ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని తాజాగా అతి తక్కువ ధరకే మంచి నీటిని అందించే కొత్త ఉత్పత్తిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం వేసవికాలం కావడంతో.. రైల్వే స్టేషన్ లో ఉండే ప్రయాణికులు మంచి నీరు కోసం అనేక ఇబ్బందులు పడుతుంటారు.  అలాంటి వారి కోసం తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అతి తక్కువ ధరకే మంచి నీటిని అందించే కొత్త ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేమిటంటే.. గాలిలోని తేమ నుంచి నీటి ఉత్పత్తి చేసే విధానం. ఇటీవలే ఈ కొత్త విధానం గురించి అందరూ వినే ఉంటారు. అయితే దీనిని దక్షిణ మధ్య రైల్వే డివిజన్ తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో.. వాతావరణ జల జనరేటర్ కియోస్క్‌ను ఏర్పాటు చేసింది. ఇక ‘మేఘదూత్‘ అని పిలవబడే ఈ వాతావరణ నీటి జనరేటర్ హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ మైత్రి ఆక్వాటెక్ ద్వారా భారతదేశంలో అభివృద్ధి చేశారు. కాగా, ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వాటర్ జనరేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి  దాని వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

మైత్రి ఆక్వాటెక్ కంపెనీ ఎండీ ఎం. రామకృష్ణకు..  తాగునీరు అందుబాటులో లేకపోవడంతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న కష్టాలను చూసి మేఘదూత్‌కు అందుబాటులోకి తీసుకురావాలని  ఆలోచన కలిగింది. ఈ క్రమంలోనే..  మేఘదూత్ నీటి జనరేటర్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక   ఇక  మేఘదూత్ పోర్టబుల్ అట్మాస్ఫియరిక్ వాటర్ జెనరేటర్ అనేది ప్రీమియం-నాణ్యతతో వచ్చే డ్రింకింగ్ వాటర్ ఎక్విప్‌మెంట్. ఇది అధిక సామర్థ్యం ఉన్న ఫిల్టర్‌ల సహాయంతో ఆవిరిని ఘనీభవించడం ద్వారా నీటిని ఉత్పత్తి చేస్తుంది. తేమ రెండు-లేయర్డ్ యాంటీ బాక్టీరియల్ ఎయిర్ ఫిల్టర్ల ద్వారా డ్రా చేస్తుంది. తద్వారా స్వచ్ఛమైన నీరుగా మార్చడానికి ముందు అయనీకరణం చేయబడుతుంది. కాగా, సేకరించిన నీరు అన్ని రకాల మలినాలు లేకుండా నీటిని చేయడానికి ముందు వడపోత ప్రక్రియను చేస్తుంది. అయితే ఉత్పత్తి చేసిన నీటిని ఓజోన్‌తో మరింత శుద్ధి చేస్తారు. అయితే ఏడబ్ల్యూజీ , అట్మాస్ఫియరిక్ వాటర్ హార్వెస్టర్ అనేది గాలిలో ఉన్న తేమ నుంచి తాగునీటిని ఉత్పత్తి చేయడానికి డీయుమిడిఫికేషన్ సూత్రాన్ని ఉపయోగించే పరికరం.

ఇక దీనిలో ఆర్ఓ పరికరాలు, డీశాలినేషన్ సిస్టమ్‌లా కాకుండా నీటి వృధా లేదని స్టార్టప్ పేర్కొంది. కంటితో కనిపించని గాలిలో తేలుతున్న సస్పెండ్ చేసిన కణాలను ఫిల్టర్ చేయడానికి యంత్రం 1 మైక్రాన్, 12 మైక్రాన్ల రెండు ఫిల్టర్‌లను కలిగి ఉంటుంది. ఇంతలో 1 లీటరు నీటిని ఉత్పత్తి చేయడానికి, కేవలం 0.3 యూనిట్ల శక్తి మాత్రమే అవసరం. అయితే ఈ నీటి కోసం రూ. 2 నుంచి రూ. 8 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. మీరు మీ బాటిల్‌ను తీసుకువెళితే మీరు రూ. 5 చెల్లించాలి. కానీ మీకు బాటిల్ కూడా అవసరమైతే, మీకు రూ. 8 ఖర్చవుతుంది. మరి, అతి తక్కువ ధరకే స్టేషన్ లో స్వచ్ఛమైన నీరు అందించే ఈ కొత్త పరికరం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి