iDreamPost

Major Movie మేజర్ – విడుదలలోనూ సాహసమే

Major Movie మేజర్ – విడుదలలోనూ సాహసమే

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాని ముందు రోజు ప్రీమియర్ వేయాలంటేనే నిర్మాతలు వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. అలాంటిది ఏకంగా వారం ముందే ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేయడమంటే ఎంత ధైర్యం కావాలి. మేజర్ టీమ్ దానికి రెడీ అంది. ఈ నెల 24 నుంచి అంటే రేపటి నుంచి ఎంపిక చేసిన 9 ప్రధాన నగరాల్లో మేజర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్ లో దానికి ఏఎంబి మాల్ వేదిక కానుంది. దీంతో పాటు ఢిల్లీ(పివిఆర్), లక్నో(కార్నివాల్), జైపూర్(సినీ పోలీస్), అహ్మదాబాద్(మిరాజ్), ముంబై(పివిఆర్), పూణే(సినీ పోలీస్) లలో మేజర్ షోలు వేయబోతున్నారు. దాదాపు కార్పొరేట్ మల్టీ ప్లెక్స్ చైన్స్ అన్నీ కవరైపోయాయి.

ఎలా చూసుకున్నా ఇది సాహసమే. కోల్కతా ముష్కర దాడుల్లో తాజ్ హోటల్ తో పాటు పలు జనావాసాల మీద భీకర దాడులు చేసిన ఉగ్రవాదులపై పోరాటం చేసి ప్రాణాలు త్యాగం చేసిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ దేశభక్తి పూరిత చిత్రానికి సోనీతో పాటు మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ఆయనే స్వయంగా పలు ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఇలాంటి నిర్ణయం గతంలో ఎవరూ తీసుకోలేదని చెప్పాలి. సినిమా గురించి పూర్తి సమాచారం బయటికి వస్తుందని తెలిసినా ఇలాంటి స్టెప్ వేయడం అంటే డేరింగే.

మేజర్ విడుదలవుతున్న జూన్ 3నే కమల్ హాసన్ విక్రమ్, అక్షయ్ కుమార్ పృథ్విరాజ్ విడుదల కాబోతున్నాయి. వాటికి ధీటుగా నిలవాలంటే మేజర్ కు ఇలాంటి స్ట్రాటజీలు చాలా అవసరం. అందులోనూ వారం ముందే మూవీ చాలా బాగుందనే టాక్ వస్తే ఆటోమేటిక్ గా కలెక్షన్లు బాగుంటాయి. అడవి శేష్ ప్రోడక్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. తనను ప్యాన్ ఇండియా స్థాయిలో మేజర్ నిలబెడుతుందనే నమ్మకం గట్టిగా వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ తో పాటు రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక అసలు కంటెంట్ కూడా ఎగ్జైట్ చేసేలా ఉంటే పుష్ప, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ సరసన మేజర్ నిలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి