iDreamPost

మహేష్, రాజమౌళి మూవీ న్యూ అప్డేట్.. SSMB29 లాంచింగ్ అప్పుడే?

మహేష్, రాజమౌళి కాంబోలో రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 షూటింగ్ కు సంబంధించిన న్యూ అప్ డేట్ వైరల్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడేనట.

మహేష్, రాజమౌళి కాంబోలో రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 షూటింగ్ కు సంబంధించిన న్యూ అప్ డేట్ వైరల్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడేనట.

మహేష్, రాజమౌళి మూవీ న్యూ అప్డేట్.. SSMB29 లాంచింగ్ అప్పుడే?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా మూవీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక మీరి కాంబోలో వచ్చే మూవీకి సంబంధించిన న్యూ అప్ డేట్స్ మహేష్ ఫ్యాన్స్ ను మరింత ఖుషీ చేస్తున్నాయి. ఎస్‌ఎస్‌ఎంబీ 29 స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశానని ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 లాంచింగ్ అప్పుడే అంటూ టాలీవుడ్ లో జోరుగా టాక్ వినిపిస్తోంది.

మహేష్, రాజమౌళి కాంబోలో రాబోతున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 షూటింగ్ కు సంబంధించిన న్యూ అప్ డేట్ వైరల్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 09న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఎస్ఎస్ఎంబీ29 లాంచ్ చేయబోతున్నారట. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించిన అప్ డేట్స్ బయటికి వస్తుండడంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా సమ్మర్ లో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను రెండేళ్లలో పూర్తి చేసి 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్టున్నట్టు టాక్ వినిపిస్తోంది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో పాపులర్‌ హిందీ యాక్టర్లతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్‌ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు ఫిట్ నెస్ గురించి ప్రత్యేక శిక్షణ కోసం ఫారిన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల మహేష్ నటించిన గుంటూరు కారం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. వారం రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి