iDreamPost

SSMB 28: మహేష్ 28 – చాలా క్లూస్ ఇచ్చారు

ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ ని చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ ని చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

SSMB 28:  మహేష్ 28 – చాలా క్లూస్ ఇచ్చారు

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహేష్ బాబు 28వ సినిమా నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా మొదలయ్యింది. ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ ని చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో పెద్ద సక్సెస్ కాకపోవడంతో వాళ్ళ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. అనిల్ రావిపూడి, పరశురామ్ లాంటి యంగ్ డైరెక్టర్స్ మహేష్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో తడబడ్డారు. ఇప్పుడు అనుభవజ్ఞుడైన త్రివిక్రమ్ చేయబోయే సెల్యులాయిడ్ మేజిక్ తో మరోసారి రికార్డులు బద్దలేనని సగటు ప్రేక్షకుకు సైతం ఓ రేంజ్ లో ఈ ప్రాజెక్టు మీద అంచనాలు పెంచుకుంటున్నారు.

నిన్న విడుదల చేసిన చిన్న వీడియోలో టీమ్ గట్టి క్లూస్ ఇచ్చింది. అందులో మొదటిది టైటిల్. ఎస్ఎస్ఎంబి 28 ఆరంభం అని నొక్కి మరీ యాష్ ట్యాగ్ ని హై లైట్ చేశారు. అంటే ఈ సినిమా పేరు అదే ఉండొచ్చనే అనుమానం బలపడుతోంది. అసలే త్రివిక్రమ్ కు అ సెంటిమెంట్ ఎక్కువ. అతడు, అత్తారింటికి దారేది. అఆ, అల వైకుంఠపురములో ఇలా బ్లాక్ బస్టర్లన్నీ అదే అక్షరంతో మొదలయ్యాయి. ఖలేజాలాంటివి డిఫరెంట్ గా ట్రై చేస్తే ఫలితం కూడా దానికి తగ్గట్టే నెగటివ్ గా వచ్చింది. అందుకే ఆరంభం టైటిల్ ఉండొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ పేరుతో గతంలో అజిత్, రానా కాంబోలో ఓ డబ్బింగ్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

మరో క్లూ విషయానికి వస్తే ఈ క్లిప్ మొదట్లో ఖాకీ డ్రెస్ నక్షత్రాన్ని హై లైట్ చేశారు. అంటే ఇందులో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. లేదా ఆ బ్యాక్ డ్రాప్ లో ఏదో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించవచ్చు. ఆగడు తర్వాత ప్రిన్స్ మళ్ళీ పోలీస్ డ్రెస్సు వేయలేదు. నొక్కి మరీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పడం చూస్తే ఇందులో సందేశాలు, సమాజాన్ని ఉద్ధరించే నేపధ్యాలు ఏమీ ఉండవనే క్లారిటీ ఇచ్చారు. శ్రీమంతుడుతో మొదలుపెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ అవేర్ నెస్ ఉండేలా చూసుకుంటున్న మహేష్ ఈసారి వాటికి స్వస్తి పలికారట. 2023 ఏప్రిల్ 28 విడుదల కాబోతున్న ఈ ఎస్ఎస్ఎంబి ఇప్పటి నుంచే సంచలనాలకు వేదిక అవుతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి