iDreamPost
android-app
ios-app

తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్ బాబు..త్వరలో ఇంట్లో శుభకార్యం!

  • Author Soma Sekhar Published - 08:56 PM, Sat - 28 October 23

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో త్వరలోనే ఓ శుభకార్యం జరగనున్నట్లు సమాచారం. మరి ఆ వేడుక ఏంటి? ఎప్పుడు జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో త్వరలోనే ఓ శుభకార్యం జరగనున్నట్లు సమాచారం. మరి ఆ వేడుక ఏంటి? ఎప్పుడు జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 08:56 PM, Sat - 28 October 23
తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్ బాబు..త్వరలో ఇంట్లో శుభకార్యం!

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. గత కొన్నాళ్లలో వరసగా అన్న, తల్లిదండ్రులను కోల్పోయిన బాధలో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. ప్రస్తుతం మహేశ్ ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని ఎలాగైనా సంక్రాంతికి తీసుకురావాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఫ్యామిలీ మ్యాన్ గా టాలీవుడ్ లో మంచి పేరుంది సూపర్ స్టార్ కు. సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటాడు మహేశ్. ఏడాదికి కనీసం రెండు మూడు సార్లైనా వెకేషన్లను ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే గత కొంతకాలంగా విషాద సంఘటనలు చవి చూసిన ఘట్టమనేని ఫ్యామిలీలో త్వరలో ఓ శుభకార్యం జరగబోతుందని సమాచారం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో గత కొన్ని సంవత్సరాలుగా విషాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా అన్న, తల్లిదండ్రులను కోల్పోయిన బాధ నుంచి మహేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుని.. సినిమా షూటింగ్స్ మెుదలు పెట్టాడు. ప్రస్తుతం మహేశ్ ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీని ఎలాగైనా సంక్రాంతి బరిలోకి దింపాలన్నది మహేశ్-త్రివిక్రమ్ ల ప్లాన్. ఇదిలా ఉండగా.. మహేశ్ కుటుంబంలో త్వరలోనే ఓ శుభకార్యం జరగనున్నట్లు సమాచారం. కాగా.. ఇది మహేశ్ తల్లి చివరి కోరికగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మహేశ్ తల్లి ఇందిరా దేవి బతికున్నప్పుడే సితార ఓణీ ఫంక్షన్ చేయాలనుకుందట. కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదట. ఇక ఆమె చనిపోవడంతో.. ఆ కోరిక అలాగే మిగిలిఉంది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ శుభకార్యాన్ని మహేశ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే సితార లంగా ఓణీ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను కూడా ఫంక్షన్ కు ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఇక ఈ వేడుక త్వరలోనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అయితే మహేశ్ గారాల పట్టి సితార.. పలు యాడ్స్ లో నటిస్తూ.. తండ్రికి తగ్గ తనయగా రాణిస్తోంది. 12 ఏళ్లకే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తన వీడియోల ద్వారా అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది సితార. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు కారం షూటింగ్ డిసెంబర్ లో పూర్తి అవుతుందని సమాచారం. ఆ తర్వాత వెంటనే దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ లోకి దూకుతాడు సూపర్ స్టార్. కొన్ని నెలల పాటు ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş