iDreamPost
android-app
ios-app

మహేష్ క్రేజ్.. 5 సెకన్ల వాయిస్ కు.. 5 కోట్ల రెమ్యునరేషన్!

  • Published Feb 23, 2024 | 8:01 PM Updated Updated Feb 23, 2024 | 8:01 PM

మహేష్ బాబు లేటెస్ట్ గా ఫోన్ పే ట్రాన్సక్షన్ కు వాయిస్ ఇచ్చాడు. కేవలం 5 సెకన్ల వాయిస్ కు ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు లేటెస్ట్ గా ఫోన్ పే ట్రాన్సక్షన్ కు వాయిస్ ఇచ్చాడు. కేవలం 5 సెకన్ల వాయిస్ కు ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మహేష్ క్రేజ్.. 5 సెకన్ల వాయిస్ కు.. 5 కోట్ల రెమ్యునరేషన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కూల్ డ్రింక్స్ నుంచి మెుబైల్ ఫోన్ ల వరకు యాడ్స్, ప్రమోషన్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. తాజాగా ఫోన్ పే ట్రాన్సక్షన్ యాప్ స్పెషల్ సెలబ్రిటీ వాయిస్ ఫీచర్ కోసం మహేష్ తన వాయిస్ అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం రిలీజ్ చేసింది ఫోన్ పే. అయితే కేవలం 5 సెకన్ల వాయిస్ ఇచ్చిన మహేష్.. అందుకోసం పుచ్చుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఎండార్స్ మెంట్స్ లో కూడా స్టార్ స్టేటస్ ను పొందుతున్నాడు. కూల్ డ్రింక్స్ నుంచి ఫోన్స్, ఇతర వస్తువులకు యాడ్స్, ప్రమోషన్స్ ఇస్తూ.. భారీగా సంపాదిస్తున్నాడు. అయితే ఇలా వచ్చిన డబ్బును పేద పిల్లల గుండె ఆపరేషన్లకు వినియోగిస్తున్నాడు. పలు స్వచ్ఛంద సేవాసంస్థల ద్వారా మంచి మనసు చాటుకుంటున్నాడు సూపర్ స్టార్. లేటెస్ట్ గా ఫోన్ పే ట్రాన్సక్షన్ యాప్ ప్రత్యేకమైన సెలబ్రిటీ వాయిస్ ఫీచర్ కోసం మహేష్ బాబు తన గొంతు అందించాడు.

ఈ వీడియోలో మహేష్ “ఇప్పుడు 50 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురుగారు. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లో నా వాయిస్ వింటారు” అంటూ మాట్లాడాడు మహేష్. దిగ్గజ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తర్వాత ఫోన్ పేకి వాయిస్ అందించిన ఘనత సూపర్ స్టార్ కే దక్కింది. ఇక ఈ 5 సెకన్ల వాయిస్ కోసం మహేష్ కు ఫోన్ పే సంస్థ ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఏంటి సామి ఈ క్రేజ్.. సెకన్ కు కోటి రెమ్యునరేషన్ తీసుకున్నాడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇటీవలే గుంటూరు కారంతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

ఇదికూడా చదవండి: పిల్ల బచ్చాలు ఈ సినిమాకి రావద్దట.. హర్రర్ మూవీ వార్నింగ్!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet