iDreamPost

Mahesh Babu: న్యూ లుక్​లో మహేష్.. ఇది కదయ్యా అభిమానులు కోరుకునేది!

  • Published Feb 09, 2024 | 6:39 PMUpdated Feb 09, 2024 | 6:48 PM

దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు సూపర్​స్టార్ మహేష్ బాబు. ఈ మూవీ కోసం కంప్లీట్​గా మేకోవర్ అయిన ఆయన న్యూ లుక్​లో అదరగొట్టేశారు.

దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు సూపర్​స్టార్ మహేష్ బాబు. ఈ మూవీ కోసం కంప్లీట్​గా మేకోవర్ అయిన ఆయన న్యూ లుక్​లో అదరగొట్టేశారు.

  • Published Feb 09, 2024 | 6:39 PMUpdated Feb 09, 2024 | 6:48 PM
Mahesh Babu: న్యూ లుక్​లో మహేష్.. ఇది కదయ్యా అభిమానులు కోరుకునేది!

నయా ప్రాజెక్ట్ ఏదైనా ఒప్పుకున్నారంటే అందులో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు హీరోలు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు, మూవీ లవర్స్​కు నచ్చేలా న్యూ లుక్స్ ట్రై చేస్తుంటారు. క్యారెక్టర్ డిమాండ్​ను బట్టి ఒక్కోసారి జట్టు బాగా పెంచుతుంటారు, మాసిన గడ్డం, పొడుగాటి మీసాలతోనూ దర్శనమిస్తుంటారు. బరువు బాగా పెరగడం లేదా తగ్గడం కూడా పాత్ర కోసం చేసే మేకోవర్​లో భాగమే. అందరి సంగతేమో గానీ దర్శకధీరుడు రాజమౌళి మాత్రం తన హీరోలను సరికొత్తగా ఆవిష్కరిస్తుంటారు. ఇది ఆయన సినిమాలను చూస్తేనే తెలిసిపోతుంది. ఇంతకుమందు చిత్రాల్లో లేని హెయిర్​ స్టైల్, బాడీ బిల్డింగ్, డైలాగ్ డెలివరీతో హీరోల్ని ఫ్రెష్​గా, డిఫరెంట్​గా ఆయన ప్రెజెంట్ చేస్తుంటారు. సూపర్​స్టార్ మహేష్​ బాబును కూడా అలా కొత్తగా చూపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. దీనికి మహేష్ న్యూ లుక్ ఉదాహరణ అని చెప్పొచ్చు.

మహేష్ బాబు న్యూ లుక్​ బయటకు వచ్చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన అన్న కొడుకు ఆశిష్ పెళ్లికి పిలవడానికి మహేష్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా నమ్రత, మహేష్​తో దిగిన ఫొటోలను ఆయన షేర్ చేయగా.. అది కాస్తా వైరల్​గా మారింది. ఆ ఫొటోల్లో మహేష్ బాగా జుట్టు పెంచారు. ఆయన గడ్డం కూడా బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఎక్కువ హెయిర్​తో, తక్కువ గడ్డంతో కనిపించే సూపర్​స్టార్ ఈ ఫొటోలో మాత్రం ఒత్తయిన జుట్టుతో పాటు ఎక్కువ గడ్డంతో దర్శనమిచ్చారు. వీటిని చూసిన అందరూ షాకవుతూనే సూపర్బ్ లుక్ అని అంటున్నారు. బాస్ ఈ లుక్ సూపర్.. కుమ్మేయండి అంటూ సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా హీరోలను సరికొత్తగా చూపించడంలో రాజమౌళిని మించినోళ్లు లేరని అంటున్నారు. ఇది మేం కోరుకునేదని చెబుతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే మూవీకి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు. మరి.. మహేష్ న్యూ లుక్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రాజమౌళి గట్టిగా నిలబడ్డాడు! టెన్షన్ అవసరం లేదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి