iDreamPost

Mahesh babu యుఎస్ లో సర్కారు కలెక్షన్ల జోరు

Mahesh babu యుఎస్ లో సర్కారు కలెక్షన్ల జోరు

మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట ఓవర్సీస్ లో అదరగొడుతోంది. ముఖ్యంగా ప్రిన్స్ కు బలమైన బేస్ ఉన్న యుఎస్ లో పాత రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతోంది. మొన్న శుక్రవారానికి ఒకటిన్నర మిలియన్ మార్కు అందుకున్న ఈ మెసేజ్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ త్వరలోనే మూడు మిలియన్ల మార్కు అందుకోవచ్చని అక్కడి ట్రేడ్ అంచనా. అదే జరిగితే భరత్ అనే నేనుని దాటేసి తన బెంచ్ మార్క్ ని తనే సవరిస్తాడు మహేష్. ఇప్పుడున్న టికెట్ రేట్లతో ఇదేమి అసాధ్యం కాదు.

ఇండియాలో టాక్ దీనికి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ వసూళ్లు గట్టిగానే వస్తున్నాయి. నైజామ్ లో కనక ఒకవేళ టికెట్ రేట్లు పెరగకపోయి ఉంటే ఆక్యుపెన్సీ చాలా ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ గా ఈ సినిమా మహేష్ కెరీర్ బెస్ట్ లో ఏ ప్లేస్ లో నిలుస్తుందన్నది వేచి చూడాలి. యూనిట్ అధికారికంగా చెబుతున్న ప్రకారం ఆల్రెడీ 103 కోట్లు గ్రాస్ దాటేసి రెండు వందల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఎంత టైంలో రీచ్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలోనూ కలెక్షన్లు బాగున్నాయి.

దగ్గరలో పెద్దగా చెప్పుకునే పోటీ లేదు కాబట్టి సర్కారు వారి పాటకు మే 27 దాకా ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. ఆ రోజు ఎఫ్3 ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ లో మార్పు వస్తుంది. అప్పటికీ మహేష్ మరీ నెమ్మదించడేమో కానీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. రేపు సక్సిస్ మీట్ కి ప్లాన్ చేసింది మైత్రి టీమ్. అభిమానుల సమక్షంలో దీన్ని గ్రాండ్ గా చేయబోతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాటలో కమర్షియల్ ఎలిమెంట్స్, తమన్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి