iDreamPost

శృతిమించిన అభిమానం – ట్విట్టర్లో వార్

శృతిమించిన అభిమానం – ట్విట్టర్లో వార్

పెద్దలో సామెత చెప్పేవారు. దాన్ని కొంచెం మోడరన్ స్టైల్ లో చెప్పాలంటే పనిలేని పండుగాడు పిల్లిగెడ్డంతో ఆడుకున్నాడట. సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానుల వ్యవహారం అచ్చం ఇలాగే ఉంది. ఏదీ తోచకపోతే ఏదైనా సినిమా చూసి టైం పాస్ చేయడం మానేసి గిల్లడం, రెచ్చగొట్టడం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ఫ్యాన్ వార్ అచ్చం ఇలాగే ఉంది. ఇటీవలే పోకిరి, ఒక్కడు లను రీ మాస్టర్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది తమిళ విజయ్ ఫ్యాన్స్ కు ఎందుకో కిట్టలేదు. తమ అక్కసుని శృతి మించిన ట్రోలింగ్ రూపంలో ట్వీట్ల ద్వారా బయటపెట్టుకోవడం మొదలుపెట్టారు.

కొంత టైం వరకు వేసి చూసిన మహేష్ అభిమానులు ఇది కాస్తా హద్దులు మీరెలా కనిపించడంతో రివర్స్ అట్టాక్ స్టార్ట్ చేశారు. పోకిరి, ఒక్కడులను తమిళంలో రీమేక్ చేసింది విజయే. కాకపోతే ఒరిజినల్ స్థాయికి దరిదాపుల్లో లేకపోయినా ఏదో స్టార్ ఇమేజ్ తో కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. రెండు పక్కనపెట్టుకుని చూస్తే విజయ్ చేసిన స్టంట్లు ఫైట్లకి నవ్వు రావడం ఖాయం. సరిగా ఆ వీడియోలనే పట్టుకొచ్చి మహేష్ ఫ్యాన్స్ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. సదరు హ్యాష్ ట్యాగ్ లు, ట్రెండింగ్ టాపిక్ లు చాలా దూరం వెళ్లిపోయాయి. పరస్పరం అసభ్య పదజాలంతో కొందరు ఏకంగా కుటుంబ సభ్యులను వీటిలోకి లాగుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు.

ఒకప్పుడు పోస్టర్ల మీద పేడ కొట్టడం, కటవుట్లు విరగొట్టడంతో బయటపడే ఈ యాంటీ ఫ్యానిజం ఇప్పుడు పైసా ఖర్చు లేని ట్విట్టర్ దందా ద్వారా వికృత రూపం దాల్చింది. ఆరవ అభిమానులు ఇలా అతి చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో అజిత్ ఫ్యాన్స్ తో విజయ్ బ్యాచ్ పడే గొడవలు నానా రచ్చ చేసేవి. ఒకదశలో అజిత్ చిరాకొచ్చి తను ఏ సంఘాలను గుర్తించనని తేల్చి చెప్పేశారు. దీంతో అవి కొంత తగ్గు ముఖం పట్టాయి. అయినా అక్కడ కూడా ఆ గిల్లి(ఒక్కడు రీమేక్), పోకిరిలను రీ రిలీజ్ చేసుకుని సంబర పడితే బాగుంటుంది కానీ ఇలా సంబంధం లేకుండా పక్క భాషలో స్టార్ హీరో మీద పడి ఏడవటం ఏమిటో పిచ్చి కాకపోతే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి