iDreamPost

సూపర్ స్టార్ ఆరోగ్యం – అంతా క్షేమమే..!

సూపర్ స్టార్ ఆరోగ్యం – అంతా క్షేమమే..!

ఇవాళ ఉదయం సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్యంతో కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరారని, కండీషన్ కొంచెం క్రిటికల్ గా ఉందని వచ్చిన వార్త సోషల్ మీడియాని ఊపేసింది. అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే భార్య ఇందిరాదేవి కన్నుమూయడంతో కలత చెందిన కృష్ణ గారి మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉందని ఆ కారణంగానే తరచుగా ఇబ్బంది పడుతున్నారని ఏవేవో వార్తలు వచ్చాయి. తాజా అప్డేట్ ప్రకారం కృష్ణ గారు వెళ్ళింది చెకప్ కోసమే. కొంచెం నలతగా అనిపించడంతో వైద్యుల పర్యవేక్షణలో టెస్టులు చేయించుకునే ఉద్దేశంతో వెళ్లారు తప్పించి అంతకు మించి మరే కారణం లేదని మహేష్ టీమ్ నుంచి వచ్చిన అఫీషియల్ న్యూస్.

Mahesh Babu Father Super Star Krishna Joins in Hospital | హాస్పిటల్లో సూపర్  స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు News in Telugu

సో ఫ్యాన్స్ ఖంగారు పడాల్సింది ఏమి లేదు. మహేష్ బాబు తక్కువ గ్యాప్ లో తల్లిని అన్నయ్య రమేష్ బాబుని కోల్పోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని రేపింది. ఇలాంటి సమయంలో కృష్ణ గారికి సంబంధించిన న్యూస్ రాగానే టెన్షన్ కలగడం సహజం. తెరమీద ఎన్నో సాహసాలతో తిరుగులేని రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్ నిజ జీవితంలోనూ అదే స్ఫూర్తితో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకుంటున్నారు. ఇద్దరు జీవిత భాగస్వాములు ఇప్పుడు తనతో లేకపోయినా వీలైనంత వరకు పరిశ్రమకు సంబంధించిన విశేషాలతో కాలం గడుపుతున్నారు. ఇటీవలే ఆలి నిర్మించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి టీజర్ లాంచ్ చేసింది కృష్ణగారే.

Mahesh Babu wishes father Krishna on his birthday, thanks him for showing  the way - India Today

కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయనకేదో జరుగుతుందని లేనిపోని ప్రచారాలు కల్పించాల్సిన అవసరం లేదు. ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చిన మహేష్ వార్త తెలిసిన వెంటనే ఆసుపత్రిలోనే ఉన్నట్టు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా తాలూకు పనులు ఒక కొలిక్కి వస్తున్న టైంలో ఏదో రూపంలో బ్రేకులు పడుతూనే ఉన్నాయి. మరి నాన్న గారిని ప్రత్యక్షంగా చూసుకోవడం మహేష్ మరికొంత బ్రేక్ తీసుకుంటాడా లేదా అనేది కృష్ణ గారు ఎంత త్వరగా డిస్ఛార్జ్ అవుతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. స్వయంగా కృష్ణ గారి అధికారిక బృందం నుంచే గుడ్ న్యూస్ వచ్చేసింది కాబట్టి ఘట్టమనేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి