iDreamPost

మహేశ్ బాబుకి ఇదే లాస్ట్ ఛాన్స్..! గట్టిగా కొట్టాలి రమణ!

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎంత క్లాస్ గా ఉంటారో.. అంత మాస్ ఇమేజ్ ఉంది. ఇండస్ట్రీలో మహేష్ బాబుని కింగ్ నాగ్ రీజనల్ బాక్సాఫీస్ అని అంటారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ పరంగా రికార్డులు బ్రేక్ చేశాయి.

తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎంత క్లాస్ గా ఉంటారో.. అంత మాస్ ఇమేజ్ ఉంది. ఇండస్ట్రీలో మహేష్ బాబుని కింగ్ నాగ్ రీజనల్ బాక్సాఫీస్ అని అంటారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ పరంగా రికార్డులు బ్రేక్ చేశాయి.

మహేశ్ బాబుకి ఇదే లాస్ట్ ఛాన్స్..! గట్టిగా కొట్టాలి రమణ!

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు తర్వాత పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. తర్వాత రాజకుమారుడు మూవీతో హీరోగా మారారు. మహేష్ బాబు నటించిన చిత్రాలు తక్కువే అయినా మాస్ క్రేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. మురారి చిత్రం మహేష్ బాబు కెరీర్ ని పూర్తిగా మార్చింది. ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు లాంటి చిత్రాలతో మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.  అందుకే ఆయనను రీజనల్ బాక్సాఫీస్ కింగ్ అని అంటారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ మూవీలో నటిస్తున్నారు మహేష్ బాబు. ఈ మూవీ లో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు కి ఇదే చివరి రీజినల్ మూవీ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. దీనికి వెనుక అసలు కథ ఎంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది టాప్ హీరోలు రీజినల్ మర్కెట్ కే స్టిక్ అయి ఉన్నారు. అలాంటి వారిలో మమ్ముట్టి, శివన్న, పవన్ కళ్యాణ్, అజిత్. వీరికి వాళ్ల ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎంత గొప్ప రేంజ్ ఉంది.  ప్రస్తుతం కుర్ర హీరోలు సైతం పాన్ ఇండియా మూవీపై కన్నెస్తున్న తరుణంలో ఈ హీరోలు మాత్రం రీజినల్ మార్కెట్ కే స్టిక్ అవుతున్నారు. ఈ హీరోల సినిమాలు వస్తున్నాయంటే పాన్ ఇండియా రికార్డులు కూడా బ్రేక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన నటించిన సినిమాలు అన్ని రీజినల్స్ సెంటర్స్‌లో ఉన్న రికార్డులు బ్రేక్ చేసి కలెక్షన్లు రాబడుతుంటాయి. ఒకదశలో బాహుబలి రికార్డ్స్ – నాన్ బాహుబలి రికార్డ్స్ అనే పదం మహేష్ బాబు తోనే మొదలయ్యిందని అంటారు. అలాంటిది మహేష్ బాబు ‘గుంటూరు కారం’ తో చివరి రీజినల్ మూవీగా బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాడు.

last chance for mahesh babu

అతడు, ఖలేజా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 12న రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. అయితే గుంటూరు కారం.. మహేష్ బాబు కి చివరి రీజినల్ సినిమా అంటున్నారు. తర్వలో ఆయన పాన్ ఇండియా- పాన్ వరల్డ్ మార్కెట్స్ ని టార్గెట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన రేంజ్ మరోలా ఉండబోతుందని ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ క్రమంలోనే గుంటూరు కారం ఆయనకు రిజీనల్ మార్కెట్ హీరోగా ఆఖరి చిత్రం అంటున్నారు.

ఈ సినిమా మహేష్ రీజినల్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని.. రాజమౌళి మూవీ బాక్సాఫీస్ లెక్కలకు దగ్గరగా ఉంటాయని నిర్మాత నాగ వంశి కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. దీనికి తగ్గట్టు దిల్ రాజు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లు ఎన్ని ఉంటాయో.. వాటిలో 95 శాతం విడుదలైన మొదటి రోజు గుంటూరు కారం ప్రదర్శించే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 96 సింగిల్ స్క్రీన్లు ఉండగా.. 90 స్క్రీన్లలో గుంటూరు కారం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అదే రోజు హనుమాన్ మూవీ కేవలం నాలుగైదు థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. దీంతో రిజినల్ హీరోగా మహేష్ బాబుకి ఇదే లాస్ట్ ఛాన్స్.. ఈసారి కొడితే గట్టిగ కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక్కడ నుంచి మహేష్ బాబు పాన్ ఇండియా ఆగమనం మొదలవుతుంది.. అక్కడ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి