iDreamPost

మహారాష్ట్ర హోమ్ మంత్రి జగన్ ను ఎందుకు కలిశాడు ?

మహారాష్ట్ర హోమ్ మంత్రి జగన్ ను ఎందుకు కలిశాడు ?

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణమైన ఘటనలను నివారించటానికి కఠినమైన చట్టాలు అవసరమని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ చట్టం సత్ఫలితాలు ఇవ్వటంతో పాటు దేశం నలుమూలలనుండి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి.

డిల్లీ మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన దిశ చట్టాన్ని ప్రశంశిస్తు ఇదే చట్టం దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని ప్రధాని మోడికి లేఖ రాశారు. పార్లమెంట్ మెంబర్ అయిన సోనాల్ మాన్సింగ్, ముఖ్యమంత్రి జగన్ తెచ్చిన ఈ చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహిత , ప్రజ్వలా ఫౌండర్ సునీత కృష్ణన్ ఈ బిల్లు తెచ్చి ముఖ్యమంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, ఒడిస్సా ప్రభుత్వం, కేరళ మంత్రి శైలజా మహిళా భద్రతకై దిశ చట్టాన్ని తెచ్చిన జగన్ ని ప్రశంశిస్తు ఆ బిల్లు పత్రాలని తమకి ఒకసారి పంపించమని విజ్ఞప్తి చేశారు.

అయితే తాజాగ ఈ నెల 18న వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టాన్ని తమ రాష్ట్రం మహారాష్ట్రలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్టు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ‘దిశ’ చట్టంపై అధ్యయనం చేసేందుకు ఈ నెల 20న రాష్ట్రానికి వస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పినట్టుగానే నేడు ముఖ్యమంత్రి వై.యస్ జగన్ న్ని కలుసుకుని దిశ చట్టం పనితీరు పై సుదీర్ఘంగా చర్చించారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో చర్చల అనంతరం బయటికి వచ్చిన మహరాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతు దిశ చ‌ట్టాన్ని ఏపీలో మాదిరిగా మ‌హారాష్ట్ర‌లో కూడా తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇలాంటి చట్టాలు చేసిన ముఖ్యమంత్రి జగన్ కి కృతజ్ఞతలు చెబుతునట్టు చెప్పారు. ఏది ఏమైన దేశ వ్యాప్తంగా పలువురు దృష్టి ఆకర్షించిన ఈ దిశా చట్టంకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి బీజం వేయడం మన రాష్ట్రానికే గర్వ కారణం…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి