iDreamPost

‘మార్క్ ఆంటోని’ విడుదలపై నిషేధం.. విశాల్ కు మద్రాస్ హైకోర్ట్ షాక్!

  • Author Soma Sekhar Published - 10:11 PM, Fri - 8 September 23
  • Author Soma Sekhar Published - 10:11 PM, Fri - 8 September 23
‘మార్క్ ఆంటోని’ విడుదలపై నిషేధం.. విశాల్ కు మద్రాస్ హైకోర్ట్ షాక్!

‘మార్క్ ఆంటోని’.. విశాల్, ఎస్.జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. మినీ స్టూడియో బ్యానర్ పై ఎస్. వినోద్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో విశాల్ తన నట విశ్వరూపం చూపినట్లుగా తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ విడుదలపై నిషేధం విధిస్తూ.. మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న మూవీపై కోర్టు ఎందుకు నిషేధం విధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో విశాల్ లైకా ప్రొడక్షన్ నుంచి రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడట. ఈ డబ్బులు తిరిగి చెల్లించే వరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే అన్ని సినిమాల హక్కులు లైకా సంస్థకు చెందే విధంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే లైకా ప్రొడక్షన్ కు అప్పు చెల్లించకుండానే గతేడాది ‘వీరమే వాగై సూడుమ్'(తెలుగులో సామాన్యుడు) సినిమాను రిలీజ్ చేయడానికి విశాల్ ప్రయత్నించాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును విచారించిన కోర్టు.. ఓ నేషనల్ బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి.. దానిలో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు అప్పట్లో ఆదేశించింది. కానీ విశాల్ ఆ డబ్బులు జమ చేయలేదు.

ఈ క్రమంలోనే విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఈరోజు హైకోర్టులో కేసు మరోసారి విచారణకు వచ్చింది. విశాల్ ఇప్పటి వరకు రూ.15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయలేదని లైకా ప్రొడక్షన్స్ కోర్టుకు తెలిపింది. దీనితో పాటుగా మార్క్ ఆంటోని సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో మార్క్ ఆంటోని సినిమా విడుదలపై నిషేధం విధిస్తూ.. హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సెప్టెంబర్ 12న విశాల్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో మేకర్స్ ఇదెక్కడి తలనొప్పి అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి