iDreamPost

ఏంటీ.. మ్యాడ్ హీరోయిన్ ఇంత చిన్నపిల్లనా..? వీడియో వైరల్

గతంలో చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగినవారున్నారు. కానీ నేటి కాలంలో.. చదువుల తర్వాత ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఇప్పుడో బ్యూటీ..

గతంలో చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగినవారున్నారు. కానీ నేటి కాలంలో.. చదువుల తర్వాత ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఇప్పుడో బ్యూటీ..

ఏంటీ.. మ్యాడ్ హీరోయిన్ ఇంత చిన్నపిల్లనా..? వీడియో వైరల్

ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్లు.. కెరీర్‌తో పాటు చదువు సంధ్య ముఖ్యం అని భావిస్తున్నారు. ఈ రంగుల ప్రపంచం గురించి కాస్తో, కూస్తో అవగాహనతోనే అడుగుపెడుతున్నారు. ఇండస్ట్రీలో బెడిసి కొడితే.. ఉన్నత చదువులు చదవడం లేదంటే.. ఉద్యోగాలు చేసుకుని సెటిల్ అయిపోతుంటారు. అందుకే డిగ్రీ, పీజీ లేదా కనీసంం ప్లస్ 2 అయినా పూర్తి చేసుంటారు. అయితే స్కూల్ దశలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేయడం గురించి విన్నారా..? ఎందుకు లేరు.. శ్రీదేవి, హన్సిక, నిన్న వచ్చిన కృతి శెట్టి సైతం చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తుంది ఈ బ్యూటీ కూడా.

కరోనా సమయంలో విద్యా సంస్థలు మూత పడ్డాయి. అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అదే సమయం కొంత మందికి వరంగా మారింది. రీల్స్, షాట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. వారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు. చిన్న వయస్సులోనే సోషల్ మీడియాను షేక్ చేసేయడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పటికే ఆమె వయస్సు 14-15 ఏళ్లు. అయితే ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియకపోవడంతో మొదట్లో ఎలాంటి ఆఫర్స్ వచ్చినా అంగీకరించేందుకు సంకోచించేవారట.. వాళ్ల పేరేంట్స్. అంతలో ఓ మూవీలో నటించగా.. అది విడుదలకు నోచుకోలేదు. అయినా కృంగిపోలేదు. 2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇది మలయాళ మూవీకి రీమేక్. ఇంతకు ఆమె ఎవరంటే.. అనంతిక.

అనంతికకు పేరు తెచ్చిన చిత్రం.. మ్యాడ్. ఇందులో మెయిన్ హీరోయిన్ ఆవిడే. ‘కళ్లజోడు కాలేజీ పాప చూడు’ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్స్ వేసి.. కుర్రాళ్ల గుండెల్లో గుడికట్టేసుకుంది ఆ బ్యూటీ. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నితిన్‌కు జోడిగా నటించింది. అందులో ఎంతో మెచ్యూర్డ్ అమ్మాయిగా కనిపించిన ఈ హీరోయిన్.. రియల్ లైఫ్‌లో ఇంకా మైనరే. ప్రస్తుతం ఆమెకు 18లోకి ఎంటర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ప్లస్ 2 చదువుతుంది. 2006లో జన్మించిన ఈ క్యూటీ.. త్రిస్సూరులో జన్మించింది. చిన్నప్పటి నుండే ఆమె సాంప్రదాయ నృత్యాలను నేర్చుకుంటుంది. కథాకళి, భరత నాట్యం, మోహినీయట్టం, కూచిపూడి వంటి శాస్త్రీయ కళారరూపాలు అభ్యసించింది. అలాగే మోడ్రన్ డ్యాన్సు తెలుసు తనకు.

అనంతిక మల్టీ టాలెంటెడ్. కలరిపట్టుతో పాటు కరాటేలో బ్లాక్ బెల్డ్. అంతేనా.. సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్త.. ఇప్పుడు నటి కూడా. అంతేకాకుండా ఇప్పుడు చెండా అనేది కూడా నేర్చుకుంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుస్తోంది. ఇంత చిన్న పిల్ల ఆ మూవీలో హీరోయిన్ గా నటించింది అనిపించకమానదు. ఇంటర్ పూర్తి కాకుండానే ఆమె వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇటీవల వచ్చిన లాల్ సలామ్ చిత్రంలో కనిపించింది పాప. ప్రస్తుతం ప్లస్ 2 ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి