iDreamPost

నిన్న కవ్వింతలు ఇవాళ కౌగిలింతలు

నిన్న కవ్వింతలు ఇవాళ కౌగిలింతలు

ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో హడావిడి జరిగిన టాలీవుడ్ మా అసోసియేషన్ ఎలక్షన్ల పోలింగ్ ఇవాళ ఉదయం మొదలైపోయింది. మధ్యాన్నం 2 వరకు సమయం ఉన్నప్పటికీ అగ్ర తారలందరూ త్వరగా రావడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు కౌగిలించుకోవడం, మోహన్ బాబుకి ప్రకాష్ రాజ్ పాద నమస్కారం చేయబోవడం ఇవన్నీ చూసేందుకు బాగున్నాయి. కానీ నిన్నటి దాకా మారీ దారుణంగా తిట్టుకున్నది వీళ్ళేనా అని అనుమానం వచ్చేలా ఉంది ఈ సీన్. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేవలం తొమ్మిది వందల సభ్యులు ఉన్న ఈ ఎన్నికకి ఇంత హడావిడి చేయాల్సి రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రామ్ చరణ్ వచ్చి తన ఓటు ఉపయోగించుకుని వెళ్ళాడు. బాలకృష్ణ సైతం 9 కే రావడం విశేషం. చిరంజీవి మీడియాతో సంభాషిస్తూ తాను ఎవరికి మద్దతు ఇచ్చానో చెప్పి ఇతరులను ప్రభావితం చేయడం ఇష్టం లేదని తేల్చేశారు. ఎవరు గెలిచినా ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుందని స్పష్టత ఇచ్చారు. బాలయ్య కూడా పేరు చెప్పకుండా పనిచేసేవాళ్ళకు ఓటు వేశానని చెప్పారు. ఇక పోలింగ్ బూత్ లో స్వల్ప తోపులాటలు, ఘర్షణలు జరిగినట్టుగా మీడియా రిపోర్ట్. లోపల సాంపుల్ బ్యాలెట్ పేపర్లు పంచి ప్రభావితం చేస్తున్నారనే వార్తలు కలకలం రేపాయి. న్యూస్ ఛానల్స్ హడావిడి మాములుగా లేదు. ఓటు వేసే వాళ్ళ కన్నా మూడింతలు ఎక్కువ సంఖ్యలో వీళ్ళే ఉన్నారు

ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఫలితాలు కూడా ఈ రోజు రాత్రి లోపే వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ కూడా చేసేస్తారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ మొత్తం రిజల్ట్ పట్ల ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. గెలిచిన వారి సంగతమో కానీ ఓడిన వారి రియాక్షన్లు చూసేందుకు మీడియా మహా ఆసక్తిగా ఉంది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ తదితరుల్లో ఎందరు వస్తారో ఎందరు డ్రాప్ అవుతారో వేచి చూడాలి. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హైప్ వచ్చిన మా ఎలక్షన్ల ప్రహసనం క్లైమాక్స్ కు చేరుకుంది. మరి ఫైనల్ గా గెలిచే హీరో ఎవరో వేచి చూద్దాం

Also Read : ఆర్గానిక్ వెంట పడుతున్న సెలబ్రిటీలు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి