iDreamPost

నాన్నకు క్లాసిక్ – కూతురికి డిజాస్టర్

నాన్నకు క్లాసిక్ – కూతురికి డిజాస్టర్

తీన్మార్ సినిమా గుర్తుందిగా. పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్. కానీ దీని ఒరిజినల్ వెర్షన్ హిందీలో రూపొందిన లవ్ ఆజ్ కల్ అప్పట్లో బ్లాక్ బస్టర్. సైఫ్ అలీ ఖాన్- దీపికా పదుకునే జంటగా నటించిన ఈ రొమాంటిక్ అండ్ పీరియాడిక్ స్టొరీ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు . దెబ్బకు దర్శకుడు ఇంతియాజ్ అలీ టాప్ లిస్టులోకి చేరిపోయాడు. ఇప్పుడు సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ లవ్ ఆజ్ కల్ సీక్వెల్ తో మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రేమికుల రోజున దీనికన్నా మంచి ఛాయస్ ఉండదని భావించిన జంటలు ఫస్ట్ డే బాగానే హౌస్ ఫుల్స్ చేసాయి. కార్తీక్ ఆర్యన్ తనకు జంటగా నటించాడు. అయితే చెప్పుకోదగ్గ అంచనాలతో వచ్చిన లవ్ ఆజ్ కల్ అనూహ్యంగా డిజాస్టర్ ఫలితం అందుకుంది. రివ్యూయర్లు దర్శకుడు ఇంతియాజ్ ని ఏకిపారేశారు. ప్రివ్యూలు చూసిన వాళ్ళు కూడా వామ్మో ఇదేం సినిమా అనుకున్నారట. ఫస్ట్ పార్ట్ లాగే ఇందులోనూ దర్శకుడు రెండు కాలాల ప్రేమకథలు చెప్పాడు. ఒకే కపుల్ ని చూపిస్తే అదే తీశాడని కామెంట్ చేస్తారని భావించి ఈసారి రన్దీప్ హుడా, అరుషి శర్మలతో ఇంకో పెయిర్ ని పెట్టాడు.

కాని అనవసర ప్రహసనాలతో కథనం నడిపించడంతో పాటు మరీ నత్తనడక స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన ఇంతియాజ్ ఫైనల్ గా కనీస అంచనాలను సైతం అందుకోలేకపోయాడు. దీంతో నాన్న కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయిన లవ్ ఆజ్ కల్ సినిమా ఇప్పుడు కూతురికి ఎప్పటికి మర్చిపోలేని డిజాస్టర్ గా మిగిలిపోయింది. సారా దీని మీద నిజానికి చాలా హోప్స్ పెట్టుకుంది. అవన్నీ ఇప్పుడు నీరుగారిపోయాయి. క్లాసిక్స్ కి సీక్వెల్ తీస్తే హిట్ కావని చరిత్ర పదే పదే రుజువు చేస్తున్నా దర్శకులు మాత్రం కొత్త కథలు ఆలోచించకుండా ఇలా దెబ్బ తినిపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి