iDreamPost

Masoom Sawaal: సినిమా పోస్టర్‌లో శానిటరీ ప్యాడ్‌పై శ్రీకృష్ణుడి బొమ్మ‌, ఎఫ్‌ఐఆర్ నమోదు

Masoom Sawaal: సినిమా పోస్టర్‌లో శానిటరీ ప్యాడ్‌పై శ్రీకృష్ణుడి బొమ్మ‌, ఎఫ్‌ఐఆర్ నమోదు

రుతుక్రమంపై కొత్త చిత్రం వ‌చ్చింది. ఇది సామాజిక ప్ర‌యోజ‌నం కోసం తీసిన సినిమా. భారతీయ సమాజంలో ఇప్పటికీ నెల‌సరి అంటే, ఎవ‌రూ బైట‌కి మాట్ల‌డ‌రు. అదేదో నిషిద్ధ అంశం అన్న‌ట్లుగానే ఉంటారు. అలాంటి అంశంపై అవగాహన కల్పించడానికి కొంద‌రు చేసిన‌ ప్ర‌య‌త్నంపై అప్పుడే కేసులు, ఎఫ్‌ఐఆర్ లు. ఈ సినిమా చాలా కొన్ని థియేట‌ర్ల‌లో ఆగస్ట్ 5న రిలీజ్ అయ్యింది. సినిమా గురించి ఎవ‌రికీ అభ్యంత‌రాలున్న‌ట్లు ఎవ‌రూ చెప్ప‌లేదుకాని, పోస్ట‌ర్ లో శానిట‌రీ ప్యాడ్ థీమ్ మీద, కేర‌క్ట‌ర్లంద‌రూ ఉన్నారు. దానిమీదే కృష్ణుడు బొమ్మ‌కూడా ఉంది. అంతే, మాసూమ్ సవాల్ పోస్టర్‌పై దేవుడు కృష్ణుడి బొమ్మను ఉంచినందుకు , హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీంటాయ‌ని ఆరోపిస్తూ, మసూమ్ సవాల్ నిర్మాత‌ల‌పై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.

ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన సీనియర్ పోలీసు అధికారి ప్ర‌కారం, మసూమ్ సవాల్ డైరెక్టర్ సంతోష్ ఉపాధ్యాయ్, అతని సంస్థ‌తోపాటుతో పాటు, సినిమాకు పనిచేసిన మొత్తం యూనిట్‌పై ఆగస్టు 7వ తేదీ ఆదివారం ఫిర్యాదు నమోదైంది. సనాతన ధర్మాన్ని పాటిస్తున్న‌వాళ్ల‌ మనోభావాలను దెబ్బతీసినందుకు, హిందూ రాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు అమిత్ రాథోడ్ కేసు పెట్టారు. యుపిలోని సాహిబాబాద్ పోలీసు స్టేష‌న్ లో కేసు న‌మోదుచేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295 (ఏ వర్గానికి చెందిన మతాన్ని అవమానించే ఉద్దేశంతో, ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేయడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మసూమ్ సవాల్ నిర్మాతలు .ప్లాన్ ప్ర‌కారం మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని, ఆ సినిమా పోస్ట‌ర్ వ‌ల్ల‌ ఉత్తరప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మతపరమైన అల్లర్లకు దారితీయవచ్చని ఫిర్యాదు పేర్కొంది. సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ సాహిబాబాద్, ఘజియాబాద్‌లోని రెండు థియేటర్ల వెలుపల హిందూ రాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు నిరసన తెలుపుతారని అమిత్ రాథోడ్ అంటున్నారు.

మొత్తానికి ఒక సామాజిక అంశంపై అవగాహ‌న కోసం మొద‌లైన సినిమా కాస్తా, శానిటరీ ప్యాడ్ పోస్ట‌ర్ మీద కృష్ణుడు బొమ్మ‌కూడా ఉన్నందుకు కేసులు పెట్టారు. అంతే ఇది కాస్తా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలామంది చాలా ఉద్రేకంగా పోస్టులు పెడుతున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి