iDreamPost

విశ్వక్ సేన్ తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన ‘బేబీ’ డైరెక్టర్!

  • Author ajaykrishna Published - 03:01 PM, Wed - 2 August 23
  • Author ajaykrishna Published - 03:01 PM, Wed - 2 August 23
విశ్వక్ సేన్ తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన ‘బేబీ’ డైరెక్టర్!

ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా ‘బేబీ’. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించారు. సాంగ్స్, ట్రైలర్, ప్రమోషన్స్ తో ఫుల్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. థియేటర్స్ లో విడుదలయ్యాక పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ దుమ్మురేపింది. అయితే.. ఇన్ని రోజులుగా ఓవైపు సినిమా సక్సెస్ జర్నీ సాగుతుంటే.. మరోవైపు సినిమా గురించి వివాదం ముదురుతూ వచ్చింది. బేబీ విషయంలో డైరెక్టర్ సాయి రాజేష్ కి, హీరో విశ్వక్ సేన్ కి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఓ హీరో బేబీ కథ వినడానికి కనీసం ఇంటరెస్ట్ కూడా చూపలేదని పేరు చెప్పకుండా మాట్లాడారు డైరెక్టర్.

అదే రోజు హీరో విశ్వక్ సేన్.. “నో అంటే నో మగాళ్లకు అయినా వర్తిస్తుంది” అని ట్వీట్ వేశాడు. కట్ చేస్తే.. తెల్లారేసరికి సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య వివాదం మొదలైందని మీమ్స్, వార్తలు. ఆ తర్వాత వేరే సినిమా ఈవెంట్ లో విశ్వక్ ఇండైరెక్ట్ గా రియాక్ట్ అవ్వడం.. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.సోషల్ మీడియాలో ఈ వివాదం గురించి రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సాయి రాజేష్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేష్.. విశ్వక్ సేన్ కి కథ చెప్పాలనుకున్న మాట నిజమే. కానీ.. అతను నో చెప్పిన విధానం తనకు నచ్చలేదని తెలిపాడు. ప్రస్తుతం సాయి రాజేష్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇంతకీ సాయి రాజేష్ ఏమన్నాడంటే.. “విశ్వక్ సేన్ కి కథ చెప్పాలని అనుకున్నా గానీ చెప్పలేదు. నేరుగా మాట్లాడలేదు కూడా. గీతా ఆర్ట్స్ వారు వెళ్లి సంప్రదించారు. ఓ ఈవెంట్ లో విశ్వక్ తన బిజీ షెడ్యూల్ కారణంగా నో చెప్పానని.. ఇప్పుడు మీరు హిట్ కొట్టారు ఆ సక్సెస్ ఎంజాయ్ చేయండి. కానీ.. అవతలి వాళ్ళను ఇన్సల్ట్ చెయ్యొద్దని చెప్పాడు. అసలు విషయం ఏంటంటే.. నేనెప్పుడూ ఏరోజు కూడా విశ్వక్ సేన్ పేరు ఎక్కడా చెప్పలేదు. ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా హీరో విశ్వక్ సేన్ కాదని చెప్పాను. అదిగాక ఈ విషయాన్నీ ఇంకా కాంట్రవర్సీ చేయదల్చుకోలేదు. నిజానికి ఆ హీరో నో చెప్పిన విధానం నాకు నచ్చలేదు. విశ్వక్ ని సంప్రదిస్తే ఇలా అన్నాడు.. వేరే ఆప్షన్ కి వెళ్ళండి అని గీతా ఆర్ట్స్ వాళ్లు చెప్పారు.

అలా అన్నాడని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే.. ఇండస్ట్రీలో 1200 మంది దర్శకులకు స్టార్ హీరోలను పక్కన పెడితే.. పది పదిహేను మంది హీరోలు మాత్రమే ఉన్నారు. ‘హృదయ కాలేయం’ లాంటి సినిమా తీసిన నాలాంటి డైరెక్టర్ లేదా మరేదైనా ప్లాప్ తీసిన డైరెక్టర్ చాలా ఆకలి మీద ఉంటారు. తమని తాము ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. అందుకే హీరోలు రిజెక్ట్ చేయడం కూడా రెస్పెక్టబుల్ గా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే.. ఒక్క ప్లాప్ తో ఒకరి టాలెంట్ ని జడ్జి చేయలేం. అలా చేసుంటే.. ఈరోజు మణిరత్నం లాంటి గొప్ప డైరెక్టర్ మనకు ఉండేవారు కాదు. ఏదైతేనేం అంతా మంచే జరిగింది. విశ్వక్ సేన్ ఎందుకు అలా అనుంటారని నేను అర్థం చేసుకోగలను. తన ప్రయారిటీ లిస్టులో నేను లేను కావచ్చు. నేను ఏ రోజూ విశ్వక్ ను ఇన్సల్ట్ చేయలేదు. అసలు విశ్వక్ సేన్ ను నాకు మధ్య గొడవేమీ లేదు. వాట్సాప్ గ్రూప్ లో కూడా మాట్లాడుకున్నాం. ఒక పార్టీకి వెళ్తే.. ‘బేబీ’ ఫస్ట్ సాంగ్ అదిరిందని విశ్వక్ నాతో అన్నాడు. తన మైండ్ లో కూడా ఎలాంటి థాట్స్ లేవు.” అని చెప్పుకొచ్చాడు. మరి దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. మరి బేబీ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి