iDreamPost

OTTలోకి వచ్చిన లోకేశ్‌ కనగరాజ్ కొత్త సినిమా! అస్సలు మిస్ కావద్దు!

  • Published Jan 27, 2024 | 3:05 PMUpdated Mar 14, 2024 | 5:06 PM

Fight Club OTT:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నిర్మాతగా మారి రూపొందించిన సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా ఫైట్‌ క్లబ్. ఈ సినిమా థియేటర్లలో విడుదలై కలెక్షన్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

Fight Club OTT:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నిర్మాతగా మారి రూపొందించిన సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా ఫైట్‌ క్లబ్. ఈ సినిమా థియేటర్లలో విడుదలై కలెక్షన్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Jan 27, 2024 | 3:05 PMUpdated Mar 14, 2024 | 5:06 PM
OTTలోకి వచ్చిన లోకేశ్‌ కనగరాజ్ కొత్త సినిమా! అస్సలు మిస్ కావద్దు!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంగ్ టాలెంట్ డైరెక్టర్లలో ఈయన పేరు మారు మోగిపోతుంది. అంతలా బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన లోకేశ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.ఇక ఈయన మొదటగా ‘మానగరం’ సినిమాతో తమిళంలో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలయిన.. కార్తీతో ‘ఖైదీ’, విజయ్ దళపతితో ‘మాస్టర్’, కమల్ హాసన్ తో ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఆ సినిమాలతో లోకేశ్ కనకరాజ్ ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేసుకుని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాగే గతేడాది విజయ్ దళపతి, త్రిష కాంబీనేషన్ లో ‘లియో’ సినిమాతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సగంతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లోకేశ్ ఇటీవలే నిర్మాతగా మారి రూపొందించిన మొదటి తమిళ్ సినిమా ‘ఫైట్‌ క్లబ్’. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి తెలుగులో స్ట్రీమింగ్ కావాడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నిర్మాతగా మారి రూపొందించిన సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా ‘ఫైట్‌ క్లబ్’. ఈ మూవీకి ఏ రహమత్ దర్శకత్వం వహించగా.. విజయ్‌ కుమార్‌ హీరోగా నటించాడు. ఇందులో హీరోయిన్‌గా మోనీషా మోహన్ మీనన్ నటించింది. ఇక ఫైట్‌ క్లబ్‌ సినిమా డిసెంబర్‌ 15న థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇరవై కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లను, తొమ్మిది కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అనేవి తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా, థియేటర్లలో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో నేడు అనగా (జనవరి 27) నుంచే ఫైట్‌ క్లబ్ మూవీ ఓటీటీలో ప్రసారం అవుతుంది. అలాగే ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‌ కానుంది.

Lokesh Kanagaraj new movie

ఇక ఫైట్‌ క్లబ్‌ కథ విషయానికి వస్తే.. మంచి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరుతెచ్చుకోవాలని హీరో సెల్వ (విజయ్ కుమార్‌) కలలు కంటాడు. అందుకు బెంజి సహకరిస్తుంటాడు. అయితే బెంజీని అతని సోదరుడి జోసెఫ్ (అవినాష్ రఘుదేవన్‌)తోనే చంపిస్తాడు రౌడీ కిర్బా (శంకర్ థాస్‌). దీంతో జోసెఫ్ జైలుకు వెళ్లడం,బెంజి చనిపోవడంతో సెల్వ జులాయిగా మారిపోతాడు. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన జోసెఫ్ కిర్బా చేసిన ద్రోహన్ని గ్రహించి ప్రతికారం తీర్చుకోవాలనుకుంటాడు. ఇలా పగలు, ప్రతీకారాలతో జోసెఫ్‌, సెల్వల జీవితం ఎలాంటి మలుపులు తిరగనుందనే తెలుసుకోవాలంటే ఫైట్ క్లబ్‌ మూవీని ఓటీటీలో చూడాల్సిందే. మరి, నేడు ఓటీటీలో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫైట్ క్లబ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి