iDreamPost

Malkajgiri: మల్కాజ్గిరిలో లోకల్ Vs నాన్ లోకల్ పోస్టర్ల కలకలం.. దేని గురించంటే

  • Published Apr 06, 2024 | 12:35 PMUpdated Apr 06, 2024 | 1:49 PM

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు..

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు..

  • Published Apr 06, 2024 | 12:35 PMUpdated Apr 06, 2024 | 1:49 PM
Malkajgiri: మల్కాజ్గిరిలో లోకల్ Vs నాన్ లోకల్ పోస్టర్ల కలకలం.. దేని గురించంటే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం దక్కించుకన్న కాంగ్రెస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లలో గెలుపు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి పూర్వ వైభవాన్ని సంపాదించుకునే పనిలో ఉంది. ఈ రెండు పార్టీలకు.. బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ పోస్టులు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాలు..

దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మూడు పార్టీల మధ్య గట్టి పోరు సాగనుంది అంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. ప్రచారం జోరందుకుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ తరఫున సునీతా మహేందర్ రెడ్డి బరిలో దిగుతుండగా.. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌.. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి తలపడతున్నారు.

Malkajgiri

ముగ్గురు సీనియర్ అభ్యర్థులు కావడంతో.. మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక పార్టీలన్ని పోటాపోటీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గ‌తంలో మాల్కాజీగిరి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన స్థానం కావడంతో కాంగ్రెస్‌ ఈ సీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది.

ఇక బీజేపీ కూడా ఈసారి మల్కాజ్‌గిరిలో విజయం సాధించాలని బలంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే ప్రధాని మదీ ఈ నియోజకవర్గం పరిధిలోరోడ్‌ షో సైతం నిర్వహించారు. ఇక మల్కాజ్గిరి.. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోని అన్ని స్థానాల్లో కారు పార్టీ విజయం సాధించింది. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తోంది.

ఎన్నికల ప్రచారం జోరందుకోవడంతో.. తాజాగా మల్కాజ్‌గిరిలో లోకల్‌, నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది. మల్కాజ్‌గిరికి హుజురాబాద్ 166 కిలోమీటర్లు, చేవెళ్ల 59 కిలోమీటర్లు అని రాసుకోచ్చారు. ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజురాబాద్‌కు వెళ్లాలి.. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్ల దూరంలోని చేవెళ్లకు వెళ్లాలి. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు.. పక్కా లోకల్‌ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇవి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి