iDreamPost

కరోనాతో కలిసి జీవనం సాగించక తప్పదు – ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

కరోనాతో కలిసి జీవనం సాగించక తప్పదు – ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్ తో కలిసి జీవించడం తప్ప వేరే మార్గం లేదని కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఇలాగే కోనసాగితే కరోనా మరణాల కన్న దేశంలో ఆకలి చావులు అధికంగా నమోదయ్యే పరిస్థితి ఏర్పడుతునదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలయిన అమెరికా బ్రిటన్ తో పోల్చితే మొత్తం సానుకూల కేసులలో భారతదేశ మరణాల రేటు చాలా తక్కువగా ఉందని ఇది లాక్ లాక్ డౌన్ నిర్ణయంతోనే సాధ్యం అయిందని చెప్పుకొచ్చారు.

వివిధ కారణాల వల్ల భారతదేశంలో ఏటా 9 మిలియన్లకు పైగా మరణాలను సంభవిస్తున్నాయని, వీటిలో నాలుగింట ఒక వంతు కాలుష్యం వల్ల చనిపోతున్నారని, ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశాలలో భారత్ కూడా ఒకటని ఇలా సహజంగా చనిపోతున్న 9 మిలియన్ల మందిని చూసినప్పుడు గత రెండు నెలల్లో 1,000 మంది కరోనా మరణంతో మీరు పోల్చినప్పుడు, ఇది భయాందోళనలకు గురయ్యే అంత పెద్ద సమస్యగా కనిపించదని అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో సుమారు 190 మిలియన్ల మంది భారతీయులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని ఈ జనాభాలో అధికశాతం లాక్డౌన్ కారణంగా జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని, లాక్ డౌన్ ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత ఎక్కువ మంది వారి జీవనోపాధిని కోల్పోతారని చెప్పుకోచ్చారు. రాబోయే ఆకలి చావుల విపత్తు నుండి భారత్ ను రక్షించుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ని సడలించి తగు జాగ్రత్తలు తీసుకుంటు ఎవరి పనులు వారు చేసుకోవాలని, ఈ మేరకు ఉద్యోగులకు కూడా ఆయా కంపెనీలు సరైన సదుపాయాలు కల్పించాలని, కరోనా తో కలిసి ఇంకో ఏడాది పాటు జీవినం సాగించక తప్పదని ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి