iDreamPost

LIGER లైగర్ 4 రోజుల వసూళ్లు – వీకెండ్ షాక్

LIGER లైగర్ 4 రోజుల వసూళ్లు – వీకెండ్ షాక్

ఊహించినట్టే లైగర్ డిజాస్టర్ రన్ నుంచి డైవర్షన్ తీసుకోలేకపోయింది. రిలీజ్ కు ముందు వరకు చేసిన ప్రమోషన్లు వృధా అయ్యాయి. హిట్ అవుతుందనే గట్టి నమ్మకంతో దుబాయ్ లోనూ ప్రమోట్ చేద్దామని ప్లాన్ చేసుకుని ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కు వెళ్లిన విజయ్ దేవరకొండ అదేమీ చేయకుండానే వెనక్కు వచ్చాడు. నిర్మాత ఛార్మీ, దర్శకుడు పూరి జగన్నాధ్ సైతం మౌనాన్ని ఆశ్రయించారు. మొత్తం 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన లైగర్ మొదటి నాలుగు రోజుల్లో కనీసం యాభై శాతం వెనక్కు తెచ్చినా పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేది కానీ ఇప్పుడా అవకాశం దరిదాపుల్లో కూడా లేదు. రెండు వందల కోట్ల మాట దేవుడెరుగు యాభై వస్తేనే గొప్ప.

ఇక లెక్కల సంగతి చూస్తే వరల్డ్ వైడ్ లాంగ్ వీకెండ్ నాలుగు రోజుల్లో లైగర్ రాబట్టిన మొత్తం 24 కోట్ల 45 లక్షలు మాత్రమేనని ట్రేడ్ టాక్. గ్రాస్ గా చూస్తే 50 కోట్ల దాకా తేలుతుంది. నైజామ్ 5 కోట్ల 55 లక్షలు, సీడెడ్ 1 కోటి 80 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 70 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 1 కోటి 40 లక్షలు, గుంటూరు 99 లక్షలు, కృష్ణా 68 లక్షలు, నెల్లూరు 53 లక్షలు, కర్ణాటకతో కలిపి రెస్ట్ అఫ్ ఇండియా 1 కోటి 45 లక్షలు, ఇతర భాషలు 75 లక్షలు రాబట్టగా హిందీ వెర్షన్ నుంచే 6 కోట్ల 25 లక్షలు, ఓవర్సీస్ 3 కోట్ల 30 లక్షలు రాబట్టింది. మూవీకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ 88 కోట్లకు పై మాటే. ఏ కోణంలో చూసుకున్నా ఇది రికవరీ కావడం అసాధ్యమని ఈజీగా చెప్పొచ్చు.

ఇక ఈ రోజు సోమవారం నుంచి సహజంగానే ఉండే డ్రాప్ మరింత ఎక్కువ మోతాదులో ఉండనుంది. నిన్నా మొన్న కార్తికేయ 2, సీతారామంలు హౌస్ ఫుల్ బోర్డులు నమోదు చేసుకున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బింబిసార సైతం స్ట్రాంగ్ గా నిలబడింది. ఈ వారం ఆరు కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ వాటి ప్రభావం పెద్దగా పడటం అనుమానమే. లైగర్ ని బిసి సెంటర్స్ లో మొదటివారం కాగానే లిఫ్ట్ చేయడానికి ఎగ్జిబిటర్లు సిద్ధపడుతున్నారు.నార్త్ లో లాల్ సింగ్ చడ్డా ఎదురుకున్న సిచువేషన్ దీనికీ కనిపిస్తోంది. కనీస జనం లేక షోలు రద్దవుతున్న పరిస్థితి ఈ రోజు నుంచి ఎక్కువయ్యేలా ఉంది. తెలుగులోనే అంతో ఇంతో ఎదురీదాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి