iDreamPost

ఆ హీరోతో రిలేషన్ కన్ఫమ్ చేసిన బ్యూటీ..!

బాలీవుడ్, టాలీవుడ్ లో ప్రేమ పక్షులు ఒక్కొక్కటిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి. పరిణీతి చోప్రా-ఎంపీ రాఘవ చద్దా, వరుణ్ తేజ్-లావణ్యలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరికొన్ని జంటలు తమ రిలేషన్స్ ను బయటకు వెల్లడిస్తున్నాయి.

బాలీవుడ్, టాలీవుడ్ లో ప్రేమ పక్షులు ఒక్కొక్కటిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి. పరిణీతి చోప్రా-ఎంపీ రాఘవ చద్దా, వరుణ్ తేజ్-లావణ్యలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరికొన్ని జంటలు తమ రిలేషన్స్ ను బయటకు వెల్లడిస్తున్నాయి.

ఆ హీరోతో రిలేషన్ కన్ఫమ్ చేసిన బ్యూటీ..!

సినీ పరిశ్రమలో లవ్ బర్డ్స్ ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. సెప్టెంబర్ నెలలో బాలీవుడ్ స్టార్ నటి పరిణితీ చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి పీటలు ఎక్కిన సంగతి విదితమే. ఆ వివాహ సమయంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను ఎప్పటికీ రాజకీయ నేతను చేసుకోనన్న మాటలను ట్రోల్ చేశారు నెటిజన్లు. ఆ తర్వాత ఇటీవల టాలీవుడ్ ప్రేమ పక్షులు.. వరుణ్ తేజ్, లావణ్యలు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో ప్రేమ జంట కూడా కెమెరా కంటికి చిక్కుతూ.. తమ డేటింగ్ విషయం దాచేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ జంటే.. ఆదిత్య రాయ్ కపూర్-అనన్య పాండే. వీరిద్దరూ ఎప్పటి నుండో డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లు వచ్చాయి.

తాజాగా అనన్యపాండే పుట్టిన రోజును పురస్కరించుకుని మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట. ఇద్దరు కలిసి ఎయిర్ పోర్టుకు వెళుతూ కనిపించారు. వెకేషన్‌లో కూడా ఓ రొమాంటిక్ పిక్ కూడా బయటకు వచ్చింది. అది వైరల్ అయిన సంగతి విదితమే. వీరిద్దరూ ఇలా కనపడటం కొత్త కాదు కానీ.. డేటింగ్‌లో ఉన్న విషయాన్ని దాటేస్తూ వచ్చారు. తాజాగా ఓ షోలో తన మనస్సులోని మాట చెప్పేసింది అనన్య. కాఫీ విత్ కరణ్ షోలో నటి సారా ఆలీఖాన్ తో కలిసి షోలో పాల్గొంది అనన్య. ఆ పాల్గొన్న సారాను కరణ్ ఆసక్తికర ప్రశ్న వేశారు. ప్రస్తుతం అనన్య పాండే దగ్గర ఉన్నవస్తువేంటీ అని అడగ్గా.. ది నైట్ మేనేజర్ అంటూ సమాధానమిచ్చింది.

ఆ ఆన్సర్‌తో సిగ్గుల మొగ్గైంది అనన్య. ఎందుకంటే.. ది నైట్ మేనేజర్ వెబ్ సిరిస్‌లో హీరో ఆదిత్యరాయ్ కపూర్ అన్న సంగతి విదితమే. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ కరెక్టేనని తెలుస్తోంది. ఇక అనన్యా పాండే తెలుగులో లైగర్ అనే మూవీలో నటించింది. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో టాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి. సారా మెట్రో అనే చిత్రంలో కనిపించనుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆదిత్యరాయ్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. అనన్య.. ఖో గయే హమ్ కహాన్ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి