iDreamPost

LIC ఏజెంట్లకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ భారీగా పెంపు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్లకు తీపి కబురును అందించింది. వారికి గ్రాట్యుటీని భారీగా పెంచుతు ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఏజెంట్లకు ప్రయోజనం కలుగనున్నది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్లకు తీపి కబురును అందించింది. వారికి గ్రాట్యుటీని భారీగా పెంచుతు ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఏజెంట్లకు ప్రయోజనం కలుగనున్నది.

LIC ఏజెంట్లకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ భారీగా పెంపు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. ఎప్పటికప్పుడు వినూత్నమైన పాలసీలను ప్రవేశపెడుతు పాలసీదారులను ఆకట్టుకుంటోంది. ఎల్ఐసీలో పొదుపు చేస్తే సొమ్ముకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్ కూడా వస్తుండడంతో ఎల్ఐసీలో పాలసీ తీసుకునేందుకు ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో బీమా సంస్థలు ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఎల్ఐసీకి అత్యంత ఆదరణ లభించింది. అయితే దీని వెనకాల సంస్థలో పనిచేసే ఎజెంట్లు, ఉద్యోగుల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏజెంట్లకు ప్రయోజనం కలిగేలా ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి గ్రాట్యుటీ భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దేశ వ్యాప్తంగా ఎల్ఐసీ ఏజెంట్లు పదమూడు లక్షలకుపైగానే ఉంటారని సమాచారం. వీరి సంక్షేమం కోసం ఆలోచించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గ్రాట్యుటీని భారీగా పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. ఎల్ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచింది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా(ఏజెంట్స్) రెగ్యులేషన్స్ 2017కు సవరణలు చేయడం ద్వారా ఇది సాధ్యమైందని సంస్థ ప్రకటించింది. అఫీషియల్ గెజిట్ ప్రచురించిన డిసెంబర్ 6 నుంచి గ్రాట్యుటీ పెంపు అమల్లోకి వస్తుందని ఎల్ఐసీ తెలిపింది. ఈ సంక్షేమ చర్యలతో దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచేలా చూస్తామని ఎల్ఐసీ తెలిపింది.

లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పోరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ, సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎల్ఐసీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ఎల్ఐసీ ఇప్పటికే కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. కస్టమర్లను మరింత ఆకర్షించి చేరువయ్యేందుకు కొత్త పాలసీలను ప్రకటిస్తోంది. బీమా చేయించుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బీమా సొమ్ముతో మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. మరి ఎల్ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి