iDreamPost

ఈ నంబర్ కి మెసేజ్ చేస్తే చాలు.. పాలసీ వివరాలు మీ ఫోన్ కే వస్తాయి

  • Published Nov 28, 2023 | 12:47 PMUpdated Nov 28, 2023 | 12:47 PM

బీమా పాలసీలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మన మొబైల్లోనే తెలుసుకునేలా ఎల్ఐసీ వాట్సాప్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..

బీమా పాలసీలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మన మొబైల్లోనే తెలుసుకునేలా ఎల్ఐసీ వాట్సాప్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..

  • Published Nov 28, 2023 | 12:47 PMUpdated Nov 28, 2023 | 12:47 PM
ఈ నంబర్ కి మెసేజ్ చేస్తే చాలు.. పాలసీ వివరాలు మీ ఫోన్ కే వస్తాయి

కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సేవింగ్స్ మీద జాగ్రత్త పెరిగింది. కోవిడ్ కు ముందు బీమా పాలసీలు అంటే జనాలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ మహమ్మారి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంత తక్కువ ఆదాయం ఉన్నవారైన సరే పొదుపు గురించి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బీమా పాలసీలు అంటే ముఖం తిప్పుకునే వారు.. ఇప్పుడు ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం పాలసీలు తీసుకుంటున్నారు. అయితే పాలసీ వివరాలు, ప్రీమియం చెల్లింపు తేదీ వంటి వివరాలు.. వినియోగదారులను కాస్త గందరగోళానికి గురి చేస్తాయి.

ఈ సమస్యలకు చెక్ పెట్టడం కోసం.. పాలసీకి సంబంధించిన పూర్తి సమచారాన్ని ఈజీగా తెలుసుకునేందుకు గాను కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ. మొబైల్లోనే అన్ని వివరాలు తెలుసుకునేలా కొత్త సర్వీస్లను ప్రారంభించింది. ఆ వివరాలు..

మొబైల్‌లోనే ఎల్‌ఐసీ సర్వీసులను అందించే విధంగా వాట్సాప్ సర్వీసుల్ని ప్రారంభించింది ఎల్ఐసీ. ఎప్పటి నుంచో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మందికి వీటి గురించి తెలియదు. ఒకవేళ మీకు గనక ఎల్ఐసీ పాలసీ ఉండి వాట్సాప్ సేవల్ని పొందాలని భావిస్తే.. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.

ఎల్ఐసీ వాట్సాప్ ద్వారా మొత్తం 10 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారులు ఎల్‌ఐసీ కేటాయించిన వాట్సాప్‌ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు.. సేవల వివరాలన్ని మీ ఫోన్ కే వస్తాయి. వాట్సాప్ లో ఈ సేవలను పొందాలంటే ముందుగా ఎల్ఐసీ పోర్టల్లో మీ పాలసీ నమోదు చేసుకోవాలి. అప్పుడే వాట్సాప్ ద్వారా మొబైల్ నంబర్ నుంచి ఎల్ఐసీ అందించే సర్వీసుల్ని పొందుతారు. దీని ద్వారా ఏయే సర్వీసులు లభిస్తాయి.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే..

ఎల్ఐసీ వాట్సాప్ సర్వీసులివే..

  • ప్రీమియం బకాయి తేదీ వివరాలు
  • బోనస్‌ సమాచారం
  • పాలసీ స్టేటస్
  • పాలసీపై వచ్చే లోన్ వివరాలు
  • లోన్ తిరిగి చెల్లింపు
  • తీసుకున్న రుణంపై వడ్డీ కట్టాల్సిన తేదీ
  • ప్రీమియం చెల్లింపు సర్టిఫికెట్‌
  • యులిప్‌-యూనిట్ల స్టేట్‌మెంట్
  • ఎల్‌ఐసీ సేవలకు సంబంధించిన లింకులు
  • ఆప్ట్‌ ఇన్‌/ఆప్ట్‌ ఔట్‌ సేవలు అందిస్తుంది.
  • ఎండ్ కన్వర్జేషన్ వంటి సేవలను కూడా పొందవచ్చు.

రిజిస్టర్ చేసుకోవడం ఎలా..

ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేసుకొంటేనే మీరు ఈ వాట్సాప్ సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్‌ నంబర్‌ను గానీ, మీ ఎల్‌ఐసీ పాలసీ వివరాలను గానీ నమోదు చేసుకోకపోతే ఈ సేవలను పొందలేరనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. మరి రిజిస్టర్ చేసుకోవాలంటే.. మీకు పాలసీ నంబర్, పాలసీల ఇన్స్టాల్మెంట్ ప్రీమియమ్స్ వివరాలతో పాటు.. పాస్పోర్ట్/ పాన్ కార్డ్ స్కాన్డ్ కాపీ ( సైజు- 100కేబీ లోపల) అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీరు

  • www.licindia.in వెబ్సైట్లోకి వెళ్లి కస్టమర్ పోర్టల్ ఆప్షన్ను ఎంచుకోవాలి.
  • మీరు గనక కొత్త యూజర్‌ అయితే న్యూ యూజర్ బటన్ మీద క్లిక్‌ చేయాలి.
  • తర్వాత ఐడీ, పాస్వర్డ్ మీద క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • అనంతరం మీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.
  • ఆపై బేసిక్ సర్వీసెస్ విభాగంలో యాడ్ పాలసీని క్లిక్ చేసి మీకు ఎన్ని పాలసీలు ఉంటే వాటన్నింటి వివరాలు అక్కడ నమోదు చేసుకోవాలి.
  • మీరు ఎల్ఐసీ పోర్టల్లో ఒక్కసారి రిజిస్టర్ అయితే.. రిజిస్ట్రేషన్ ఫామ్లో పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ వంటి ప్రాథమిక వివరాలు వాటంతట అవే వస్తాయి.
  • రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. ఎల్ఐసీ అధికారిక వాట్సాప్ నంబర్ ‘89768 62090’ ను మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి.
  • వాట్సాప్ ఓపెన్ చేసి పైన చెప్పిన నంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపాలి.
  • మీకు ఎల్ఐసీ అందించే సేవల వివరాలు నంబర్ల రూపంలో కనిపిస్తాయి.
  • అందులో మీకు కావాల్సిన సేవల నంబర్ను ఎంచుకుంటే చాలు.. ఆ వివరాలు అక్కడ మీకు కనిపిస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి