iDreamPost

LIC సూపర్‌ ప్లాన్‌.. రూ.87తో 11 లక్షల రాబడి

  • Published Nov 02, 2023 | 2:00 PMUpdated Nov 02, 2023 | 2:00 PM

ప్రస్తుత కాలంలో సంపాదన ఎంత తక్కువ ఉన్నా సరే.. పొదుపు తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ ఒక అద్భుతమైన పాలసీ తీసుకు వచ్చింది. ఆ వివరాలు..

ప్రస్తుత కాలంలో సంపాదన ఎంత తక్కువ ఉన్నా సరే.. పొదుపు తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ ఒక అద్భుతమైన పాలసీ తీసుకు వచ్చింది. ఆ వివరాలు..

  • Published Nov 02, 2023 | 2:00 PMUpdated Nov 02, 2023 | 2:00 PM
LIC సూపర్‌ ప్లాన్‌.. రూ.87తో 11 లక్షల రాబడి

పొదుపు.. మనిషి జీవితాన్ని నిలబెడుతుంది. నీటి బొట్లు అన్ని కలిసి మహా సంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు.. నేడు మనం దాచే ప్రతి రూపాయి.. ఏదో ఒక రోజు మన అవసరాలకు అక్కరకు వచ్చే పెద్ద మొత్తం అవుతుంది. ఇక నేటి కాలంలో పొదుపు పథకాలకు చాలా ప్రాధాన్యత పెరిగింది. దాంతో బీమా కంపెనీలు, బ్యాంక్‌లు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా రకరకాల పొదుపు పథకాలను తీసుకువస్తున్నాయి. కరోనా తర్వాత పొదుపు పథకాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ తీసుకువచ్చిన ఒక పథకం ఎందరినో ఆకర్షిస్తుంది. దీనిలో చేరితే.. రోజుకు 87 రూపాయల పొదుపుతో 11 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆ పథకం వివరాలు..

ఎల్‌ఐసీ తీసుకువచ్చిన ఈ పథకం కేవలం మహిళల కోసం రూపొందించారు. ఇది నాన్‌లింక్డ్‌ ఇండివిడ్యువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌. ఈ ప్లాన్‌లో భాగంగా.. ఇన్సూరెన్స్‌ పొందిన వ్యక్తికి మెచ్యూరిటీ తర్వాత ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ అందిస్తారు. ఒకవేళ ఆమె అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇక ఈ పథకంలో చేరితే ప్రతి రోజు 87 రూపాయల చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఓ 55 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ 15 ఏళ్ల పాటు అనగా 70 ఏళ్లు వయసు వచ్చే వరకు ప్రతి రోజు.. రూ.87 పొదుపు చేయడం ప్రారంభించింది అనుకుందాం. అంటే ఏడాదికి ఆమె చేసే పొదుపు మొత్తం రూ.31,755 అవుతుంది. పదేళ్లకు కాంట్రిబ్యూట్‌ చేసిన అమౌంట్‌ రూ.3,17,550కి చేరుతుంది. అదే 15 ఏళ్ల పాటు పొదుపు చేస్తే.. ఆ మొత్త సుమారు 5 లక్షల వరకు అవుతుంది. కానీ చివరగా 70 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఇన్సూరెన్స్‌ పొందిన వ్యక్తి మొత్తం రూ.11 లక్షలు పొందుతారు.

ఈ ప్లాన్‌ను తీసుకొనేందుకు గాను వయస్సు 8-55 సంవత్సరాల వయసు వరకు అర్హులు. కనీసం 10 సంవత్సరాల పాటు దీనిలో పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా 20 సంవత్సరాల వరకు పాలసీ వ్యవధి ఉండవచ్చు. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలుగా ఉంది.

ఈ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు..

  • ప్రీమియం పేమెంట్‌ కాలవ్యవధి పాలసీ వ్యవధికి అనుగుణంగా ఉంటుంది. పాలసీదారు తన ఆర్థిక పరిస్థితి ఆధారంగా.. ఏడాదికి ఒక్క సారే మొత్తం చెల్లించవచ్చు. లేదంటే నెల, మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి ప్రీమియం మొత్తాన్ని విడతలుగా చెల్లించవచ్చు.
  • ఈ ప్లాన్‌ మీద లోన్ పొందే అవకాశం కూడా ఉంది.
  • పాలసీదారులకు వరుసగా మొదటి రెండు పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి పాలసీని సరెండర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • పాలసీదారు అకాల మరణం చెందితే, ప్లాన్ డెత్‌ బెనిఫిట్స్‌ అందిస్తుంది.
  • పాలసీలో పేర్కొన్న నామినీకి డెత్‌ బెనిఫిట్స్‌ అందిస్తారు.
  • ఇక పాలసీని మిస్ చెయ్యకుండా కట్టిన వాళ్లు మెచ్యూరిటీ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి