iDreamPost

లియో.. స్టోరీపై రూమర్స్! అదే నిజమైతే తెలుగువాళ్లకు పాతదే!

  • Author ajaykrishna Updated - 11:53 AM, Sat - 23 September 23
  • Author ajaykrishna Updated - 11:53 AM, Sat - 23 September 23
లియో.. స్టోరీపై రూమర్స్! అదే నిజమైతే తెలుగువాళ్లకు పాతదే!

పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. వాటికి సంబంధించి ప్రతీ విషయంలో ఆరాలు తీస్తుంటారు ప్రేక్షకులు. హీరోహీరోయిన్స్ క్యారెక్టర్స్ తో పాటు సాంగ్స్, స్టోరీస్ పై కూడా దృష్టి పెడుతుంటారు. అలా ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన ‘లియో’ మూవీపై ఫోకస్ పెట్టేశారు ఆడియన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో ఊహించని రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో లోకి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు లోకేష్. ఇప్పుడు అదే యూనివర్స్ లో భాగంగా లియో రూపొందినట్లు టాక్ ఉంది.

ఇప్పటికే లియోకి సంబంధించి అన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలలో కనిపించనున్న సంగతి తెలిసిందే. లియోలో సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గా, అర్జున్ హరోల్డ్ దాస్ గా నటించారు. లియో మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. కాగా.. తాజా సమాచారం ప్రకారం.. లియో స్టోరీ లైన్ కి సంబంధించి ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. లియో మూవీ తెలుగులో ప్రభాస్ నటించిన ఓ తెలుగు మూవీని పోలి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో మూవీ స్టోరీ.. తెలుగులో డార్లింగ్ ప్రభాస్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మున్నా’ సినిమా కథకు దగ్గరగా ఉంటుందని అంటున్నారు. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ తండ్రి కాగా.. తన కొడుకు మున్నానే తండ్రిపై ప్రతీకారం తీర్చుకునే కథతో వచ్చింది. ఇప్పుడు లియో కూడా అలాంటిదేనని.. ఆంటోనీ దాస్ అయిన సంజయ్ దత్ కి, కొడుకు లియోకి మధ్య క్లాష్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. మధ్యలో హరోల్డ్ దాస్ గా అర్జున్, విజయ్ కి బ్రదర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో గానీ.. లియో స్టోరీపై రూమర్స్ అయితే విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే తెలుగువాళ్ళకు లియో కొత్తగా అయితే అనిపించదు. ఎందుకంటే తెలిసిన కథను ఎలా తిప్పి చెప్పినా పట్టేస్తారు జనాలు. మరి లోకేష్ కనగరాజ్ మ్యాజిక్ చూడాలంటే అక్టోబర్ 19 వరకు వెయిట్ చేయాల్సిందే. లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Also Read: గుంటూరు కారం.. ఫస్ట్ టైమ్ ఆ రూల్ బ్రేక్ చేస్తున్న గురూజీ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి