iDreamPost
android-app
ios-app

ఘోర ప్రమాదం..సమాధిగా మారిన గ్రామం..100 మంది మృతి!

ఊరు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది..పచ్చని పొలాలు, పైరగాలు. పచ్చని పొలాలతో నిండి ఊర్లలో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఓ గ్రామం ఉన్నట్లు ఉండి సమాధిగా మారిపోయింది. అసలెేం జరిగిదంటే..

ఊరు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది..పచ్చని పొలాలు, పైరగాలు. పచ్చని పొలాలతో నిండి ఊర్లలో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఓ గ్రామం ఉన్నట్లు ఉండి సమాధిగా మారిపోయింది. అసలెేం జరిగిదంటే..

ఘోర ప్రమాదం..సమాధిగా మారిన గ్రామం..100 మంది మృతి!

గ్రామం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది..పచ్చని పొలాలు, పైరగాలు. పచ్చని పొలాలతో నిండి ఊర్లలో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇక గ్రామాల్లో ఉండే జనాలు, వారి సంప్రదాయాలు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్ని పక్కన పెడితే అప్పుడప్పుడు గ్రామాల్లో దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ గ్రామంలో జరిగిన ఘటన కారణంగా.. ఆ ఊరంతా సమాధిగా మారిపోయింది. ఈ ఘటన చూసి.. ఆ చుట్టుపక్కల గ్రామాల వారు ఆందోళ వ్యక్తం చేశారు. ఇంతకీ ఊరు సమాధిగా ఎలా మారింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ప్రకృతి కారణంగా సంభవించే ప్రమాదాలు మనిషి ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. ఇప్పటికే అనేక రకాల ప్రకృతి విపత్తులు చూశాం. తాజాగా పసిఫిక్‌ దేశం పపువా న్యూ గినియాలో ఘోరమైన ప్రకృతి విపత్తు సంభవించింది. మారుమూల ప్రాంతంలోని ఓ గ్రామంలో  కొండచరియలు విరిగిపడి బీభత్స వాతావరణాన్ని సృష్టించాయి. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా మరణించారని సమాచారం. పదుల సంఖ్యలో స్థానికులు గాయపడ్డినట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవాకాశం ఉన్నట్లు సమాచారం. పపువా న్యూ గినియా దేశ రాజధాని పోర్ట్‌ మోరెస్టీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంపై ప్రకృతి విరుచకపడింది.

కొండచరియలు రూపంలో మృత్యువు ఆ ఊరిపై పంజా విసిరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డాయి. దీంతో ఊరంతా ధ్వంసమైంది. పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన సంభవిచండంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లు పూర్తిగా నేలమట్టమై బండరాళ్లు, చెట్ల కింద ఉండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటకం కలుగుతోంది. ఇప్పటివరకు 100కు పైగా మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

గతంలో కూడా ఓ ప్రమాదంలో పడవ మునిగి 60 మంది మరణించారు. పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సౌతాఫ్రిక ప్రాంతంలోని ఓ దేశంలో పడవ ప్రమాద ఘటన జరిగింది. పొట్ట చేత పట్టుకుని వేరే దేశంలోకి వెళ్లే ప్రయత్నంలో అధిక లోడు కారణంగా పడవ బోల్తా పడి.. పదుల సంఖ్యలో జనాలు జలసమాధి అయ్యారు. తాజాగా పపువా న్యూగినియా దేశంలో  జరిగిన ప్రకృతి విపత్తు కారణంగా ఏకంగా ఓ ఊరే సమాధిగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి