iDreamPost

ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకును తలచుకుని ఎమోషనల్! ఏం జరిగిందంటే?

చిన్న సమస్యే అని ఆస్పత్రికి వెళ్లిన లేడీ కమెడియన్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దాంతో ఆమె సర్జరీకి రెడీ అయ్యింది. అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె తన రెండేళ్ల కొడుకుని తలచుకుని ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ ప్రముఖ లేడీ కమెడియన్ ఆస్పత్రిలో చేరింది. చిన్న సమస్యే అని ఆస్పత్రికి వెళ్లిన సదరు నటికి..  డాక్టర్లు చెప్పిన విషయం షాక్ కు గురిచేసింది. ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో తన కొడుకును తలచుకుని ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె యూట్యూబ్ లో పంచుకుంది. ఇంతకీ ఆ నటికి ఏమైంది? పూర్తి వివరాల్లోకి వెళితే..

హిందీ షోల్లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భారతి సింగ్ ఆస్పత్రిలో చేరింది. తనకు ఆపరేషన్ కూడా జరగబోతోందని చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె తన కొడుకును మిస్ అవుతున్నట్లు ఆ వీడియోలో పేర్కొంది. అసలేం జరిగిందంటే? భారతి సింగ్ కు కొన్ని రోజులుగా కడుపులో నొప్పి వస్తోందట. దానికి ఆమె గ్యాస్ ప్రాబ్లెమ్ అని లైట్ తీసుకుంది. కానీ తాాజాగా ఆ నొప్పి ఎక్కువ కావడంతో.. ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆమెకు పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని, సర్జరీ చేయాలని తెలిపారు.

దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె తన కొడుకును మిస్ అవుతున్నట్లు తన యూట్యూబ్ వీడియో లో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. భారతి సింగ్ నటుడు హర్ష్ ను పెళ్లి చేసుకుంది. వారికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ఆమె ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు వీడియోలు చేసి అభిమానులను అలరిస్తోంది. తాను ఆస్పత్రిలో చేరిన వీడియోను తన ఛానల్ లో అప్లోడ్ చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవలని నెటిజన్లు, ఫాలోవర్లు ప్రార్థిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి