iDreamPost

lal singh chaddha లాల్ సింగ్ చద్దా – అమీర్ మార్కు కంటెంట్

lal singh chaddha లాల్ సింగ్ చద్దా – అమీర్ మార్కు కంటెంట్

అమీర్ ఖాన్ తెరపై వచ్చి అయిదేళ్ళు దాటింది. అందుకే నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే లాల్ సింగ్ చద్దా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కి దూరంగా తనకు మాత్రమే సాధ్యమయ్యే కంటెంట్ బేస్డ్ మూవీస్ తోనూ వేల కోట్లు కొల్లగొడుతున్న ఈ విలక్షణ నటుడు చివరి సారి కనిపించింది థగ్స్ అఫ్ హిందుస్థాన్ లో. తన శైలికి భిన్నమైన రెగ్యులర్ సబ్జెక్టుని ఎంచుకోవడంతో ఫెయిల్యూర్ చూడాల్సి వచ్చింది. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి అద్భుతాలు మళ్ళీ కావాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. వాళ్ళ కోరిక తీర్చేందుకే వచ్చిన మూవీగా లాల్ సింగ్ చద్దా మీద హైప్ క్రమంగా పెరుగుతోంది.

ఇది 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ కు అఫీషియల్ రీమేక్. అప్పట్లో దీన్ని మన ఆడియన్స్ థియేటర్లలో ఎగబడి చూశారు. కానీ ఈ జెనరేషన్ కి దాని మీద అవగాహన తక్కువ. అందుకే రిస్క్ గురించి ఆలోచించకుండా అమీర్ దీనికి ఓకే చెప్పాడు. చిన్నప్పుడు అంగవైకల్యంతో బాధపడే ఓ పిల్లాడు తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్మీలో చేరి ఏకంగా రాష్ట్రపతి పతకం స్వీకరించే స్థాయికి ఎదుగుతాడు ఈ క్రమంలో అతను ఎదురుకున్న మనుషులు, సంఘటనల సమూహారమే లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామాకు అమీర్ ఖానే ప్రధాన నిర్మాణ భాగస్వామి.

ఇందులో నాగ చైతన్య ఒక ప్రత్యేక క్యామియో చేసిన సంగతి తెలిసిందే. అమీర్ తో పాటు ఆర్మీ క్యాంప్ లో కొలీగ్ గా నటించాడు. లెన్త్ ఎంతనేది రిలీజయ్యాకే తెలుస్తుంది కానీ ఫ్యాన్స్ మాత్రం కేవలం రెండు మూడు షాట్లకే పరిమితం కావడం చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా విలన్ గా మనకూ బాగా సుపరిచితుడైన అతుల్ కులకర్ణి ఈ లాల్ సింగ్ చద్దా ఇండియన్ వెర్షన్ కు రచయిత. కరీనా కపూర్ చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ గా తళుక్కుమంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 రికార్డులు బ్రేక్ చేస్తుందనే నమ్మకం బాలీవుడ్ ట్రేడ్ లో ఉంది. ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న లాల్ సింగ్ చద్దాని తెలుగు తమిళంలో కూడా డబ్ చేయబోతున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి