iDreamPost

MS Dhoni: వీడియో: ధోని సిక్స్​కు నోరెళ్లబెట్టిన హీరోయిన్.. ఆ షాట్​కు కరీనా కూడా షాకైంది!

  • Published Apr 15, 2024 | 8:48 PMUpdated Apr 15, 2024 | 8:48 PM

సీఎస్​కే మ్యాచ్ ఉంటే ఎంఎస్ ధోని కోసం వచ్చే వాళ్లు ఎక్కువ. మాహీ బ్యాటింగ్ చూసేందుకే వేలాది మంది స్టేడియాలకు తరలి వస్తారనేది తెలిసిందే. వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. అలా వచ్చిన ఓ హీరోయిన్ మాహీ బ్యాటింగ్​కు ఫిదా అయ్యారు.

సీఎస్​కే మ్యాచ్ ఉంటే ఎంఎస్ ధోని కోసం వచ్చే వాళ్లు ఎక్కువ. మాహీ బ్యాటింగ్ చూసేందుకే వేలాది మంది స్టేడియాలకు తరలి వస్తారనేది తెలిసిందే. వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. అలా వచ్చిన ఓ హీరోయిన్ మాహీ బ్యాటింగ్​కు ఫిదా అయ్యారు.

  • Published Apr 15, 2024 | 8:48 PMUpdated Apr 15, 2024 | 8:48 PM
MS Dhoni: వీడియో: ధోని సిక్స్​కు నోరెళ్లబెట్టిన హీరోయిన్.. ఆ షాట్​కు కరీనా కూడా షాకైంది!

టీ20 అంటేనే ఎంటర్​టైన్​మెంట్​కు కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఇక్కడ క్లాసికల్ షాట్స్ లేదా బుక్ క్రికెట్ ఆడేవాళ్లు తక్కువ. ధనాధన్ షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించడమే ధ్యేయంగా ఆడుతుంటారు. ఈ ఫార్మాట్​లో ఎందరో గ్రేట్ బ్యాటర్లు ఉన్నారు. అయితే అందరిలోకెల్లా మహేంద్ర సింగ్ ధోని చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఆఖర్లో వస్తూ భారీ షాట్లు బాదడం అతడి ప్రత్యేకత. ఉన్నంత సేపు బిగ్ సిక్సెస్, బౌండరీస్​తో విరుచుకుపడే మాహీ.. చూస్తుండగానే అవతలి జట్టు చేతుల్లో నుంచి మ్యాచ్​ను లాగేసుకుంటాడు. బెస్ట్ ఫినిషర్​గా పేరు మోసిన అతడి గేమ్​ను చూసేందుకు వేలాది మంది స్టేడియాలకు పోటెత్తుతారు. నిన్న ముంబై ఇండియన్స్​తో చెన్నై మ్యాచ్​కూ ఇలాగే వచ్చారు. అందులో ఇద్దరు ఫిల్మ్ సెలబ్రిటీ కూడా ఉన్నారు. సీఎస్​కే ఇన్నింగ్స్ టైమ్​లో ధోని చివర్లో వచ్చి సిక్సులు బాదాడు. అది చూసి వాళ్లు నోరెళ్లబెట్టారు.

ముంబైతో మ్యాచ్​లో ఆఖరి ఓవర్​లో బ్యాటింగ్​కు దిగాడు ధోని. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్​లో ఆడిన 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు మాహీ. వరుసగా 3 సిక్సులు కొట్టిన సీఎస్​కే బ్యాటర్.. చివరి బాల్​కు డబుల్ తీశాడు. దీంతో 180 పరుగులు చేస్తుందనుకున్న చెన్నై కాస్తా 206 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ముంబై ఓవర్లన్నీ ఆడి 186 పరుగులే చేయగలిగింది. 20 పరుగుల తేడాతో ఎంఐ ఓడిపోయింది. ఆఖర్లో వచ్చి ధోని బాదిన రన్స్ కూడా అన్నే కావడం విశేషం. అయితే మాహీ వరుస సిక్సులకు వాంఖడే స్టేడియం దద్దరిల్లింది. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, నేహా ధూపియా ధోని బ్యాటింగ్​ చూసి నోరెళ్లబెట్టారు.

ధోని షాట్​కు ఆశ్చర్యపోయిన నేహా ధూపియా దాన్ని చూస్తూ నోరెళ్లబెట్టారు. పక్కనే కూర్చున్న కరీనా కూడా షాక్​కు గురయ్యారు. నేహా ధూపియా నమ్మశక్యం కానట్లు చూస్తూ ఉండిపోగా.. కరీనా ఆ సీన్​ను తన ఫోన్​లో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ధోని షాట్​ అంటే మజాకానా? అంటున్నారు. మాహీ తన బ్యాటింగ్​తో హీరోయిన్లను కూడా నోరెళ్లబెట్టేలా చేశాడని.. అతడి బ్యాటింగ్​కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. వయసు మీద పడుతున్న కొద్దీ ధోని మరింత యంగ్ అవుతున్నాడని.. యంగ్ బ్యాటర్స్​తో పోటీపడి భారీ షాట్లు బాదుతున్నాడని చెబుతున్నారు. మరి.. ముంబైతో మ్యాచ్​లో మాహీ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి