iDreamPost

గుంటూరు కారం నుంచి కుర్చీని మడతపెట్టి.. తాతకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే

  • Published Dec 30, 2023 | 9:07 AMUpdated Jan 10, 2024 | 3:48 PM

Kurchi Tata Reaction On Guntur Kaaram Kurchi Madatha Petti: కుర్చీ మడతపెట్టి.. అంటూ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు కుర్చీ తాత. తాజాగా ఇదే డైలాగ్ ను మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో సాంగ్ గా వాడుకున్నారు. దీనిపై కుర్చీ తాత రియాక్షన్ ఎలా ఉందంటే..

Kurchi Tata Reaction On Guntur Kaaram Kurchi Madatha Petti: కుర్చీ మడతపెట్టి.. అంటూ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు కుర్చీ తాత. తాజాగా ఇదే డైలాగ్ ను మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో సాంగ్ గా వాడుకున్నారు. దీనిపై కుర్చీ తాత రియాక్షన్ ఎలా ఉందంటే..

  • Published Dec 30, 2023 | 9:07 AMUpdated Jan 10, 2024 | 3:48 PM
గుంటూరు కారం నుంచి కుర్చీని మడతపెట్టి.. తాతకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత.. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ రిలీజై సినిమాలపై అంచనాలు పెంచేశాయి.  ధమ్ మసాలా, ఓ మై బేబి, కుర్చీ మడత పెట్టి వంటి సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మరో సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. అలాగే ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్  చేపట్టగా.. భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి విదితమే.

జనవరి 12న విడుదల అవుతున్న ఈ మూవీ టికెట్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్ సహా పలు నగరాల్లో స్పెషల్ షోకు పర్మిషన్ కూడా వచ్చేసంది. అయితే ఈ మూవీలోని కుర్చీ సాంగ్ ఓ ఊపు  ఊపేస్తుంది. కొంత మంది ఇది మహేష్ కు తగ్గ సాంగ్ కాదని విమర్శించినా.. యూట్యూబ్‌లో నాన్ స్టాప్ గా దూసుకెళుతోంది. ఈ సాంగ్ లో శ్రీలీలతో పోటీ పడి మరీ చేశారు మహేష్ బాబు. తాజాగా ప్రీ రిలీజ్  ఈవెంట్ సందర్భంగా కూడా ఆమె డ్యాన్స్ గురించి పొగడ్తలతో ముంచేసిన సంగతి విదితమే. హీరోలకు తాట ఊడిపోద్ది అంటూ కామెంట్స్ చేశారు సూపర్ స్టార్. అయితే ఈ పాట కుర్చీ తాత డైలాగ్ నుండి తీసుకున్న సంగతి విదితమే.  ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా ఈపాటే వినిపిస్తోంది. మరీ ఈ పాటపై కుర్చీ తాత స్పందిస్తూ..

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో నా డైలాగ్ ను పాటగా వాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా డైలాగ్ కు మహేష్ బాబు వేసిన డ్యాన్స్ వేరే లెవల్. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే.. ఈ పాటలో ఒక్క చరణానికైనా డ్యాన్స్ వేయాలని ఉంది. అంత గొప్ప నటుడు నా డైలాగ్ ను వాడుకోవడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అంతేకాక గుంటూరు కారం మూవీ డైరెక్టర్ తమన్ తమను పిలిచి.. తన కుర్చీ డైలాగ్ ను సినిమాలో  వాడుకున్నామని చెప్పడమే కాక తనకు లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. కుర్చీ పాటపై రియాక్ట్ అవుతూ మరోసారి మాస్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు కుర్చీ తాత. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి కుర్చీ మడతపెట్టి సాంగ్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి