iDreamPost

హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు.. అలాంటి టెక్నాలజీకి కృతిసనన్ సపోర్ట్!

Kriti Sanon: ఆదిపురుష్ తో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ అమ్మడు ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Kriti Sanon: ఆదిపురుష్ తో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ అమ్మడు ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు.. అలాంటి టెక్నాలజీకి కృతిసనన్ సపోర్ట్!

రాను రాను టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సాంకేతికత వల్ల మనిషి జీవనం ఎంతో సులభతరం అవుతోంది. మానవుడు మేథస్సు కూడా రెట్టింపు అవుతోంది. అయితే ఇదే టెక్నాలజీ వల్ల మనిషి జీవితం అస్తవ్యస్తం అవుతున్న సంగతి కూడా తెలిసిందే. సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ.. మానవుడు కొత్త కొత్త ప్రమాదాల్లో పడుతున్నాడు. టెక్నాలజీ వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ లేనిపోని కష్టాలు ఎదుర్కొంటుకున్నారు. ఇటీవల డీప్ ఫేక్ అనే పేరు బాగా వినిపించింది. కత్రినా కైఫ్, రష్మికా మందన్నా లాంటి హీరోయిన్లు ఈ టెక్నాలజీ వల్ల బాధితులుగా మారడం చూశాం. అలాంటి టెక్నాలజీకి బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ మద్దతు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బాలీవుడ్ లో కృతి సనన్ కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఈ అమ్మడికి బాగానే ఫాలోయింగ్ ఉంది. మహేశ్ తో కలిసి 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇటీవల ప్రభాస్ తో ఆదిపురుష్ చేసిన తర్వాత టాలీవుడ్ లో ఆ రేంజ్ మరో ఎత్తుకు వెళ్లింది. ఇప్పుడు హిందీలో తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా అనే సినిమా చేస్తోంది. ఆ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ టెక్నాలజీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. డీప్ ఫేక్ టెక్నాలజీతో చేసిన వీడియోల విషయంలో కృతి సనన్ ఆందోళన వ్యక్తం చేసింది.

Deep Fake Videos Kritisanan Support!

“కొన్ని నెలల నుంచి సెలబ్రిటీల మార్ఫింగ్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యాంకర్ ని కూడా తయారు చేశారు. అయితే మార్ఫింగ్ వీడియోలకు సంబంధించి డీప్ ఫేక్ టెక్నాలజీ నిందించడం తప్పు. ఆ టెక్నాలజీ వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ మన భాగస్వామి అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు” అంటూ కృతి సనన్ టెక్నాలజీకి సంబంధించి తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అయితే ఇవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు అయినప్పటికీ నెటిజన్స్ నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తనలాంటి హీరోయిన్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తే.. కృతిసనన్ అలాంటి టెక్నాలజీకి మద్దతు తెలపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యతిరేకించారు. ఇలాటి టెక్నాలజీ వల్ల మహిళలకు భద్రత లేకుండా పోతుందని వాపోయారు. డీప్ ఫేక్ లాంటి సాంకేతికతను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, కృతిసనన్ మాత్రం డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీకి మద్దతు ఇవ్వడం పాన్ ఇండియా లెవల్లో కొత్త చర్చకు దారి తీసింది. మరి.. డీప్ ఫేక్ టెక్నాలజీకి కృతి సనన్ మద్దతు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి