iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ హీరోలపై కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు.. అలా అనేసిందేంటి?

Kriti Sanon on Bollywood Heroes: బాలీవుడ్ ఇండస్ట్రీపై ఎప్పుడూ ఏదో ఒక మరక, విమర్శ, ఆరోపణ వస్తూనే ఉంటుంది. తాజాగా కృతి సనన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Kriti Sanon on Bollywood Heroes: బాలీవుడ్ ఇండస్ట్రీపై ఎప్పుడూ ఏదో ఒక మరక, విమర్శ, ఆరోపణ వస్తూనే ఉంటుంది. తాజాగా కృతి సనన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ హీరోలపై కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు.. అలా అనేసిందేంటి?

కృతి సనన్ పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ తో ఆదిపురుష్ చేసిన తర్వాత తెలుగులో కూడా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. సీతగా ఈ అమ్మడుని చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఈమె సహజసిద్ధమైన నటనకు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం కృతి సనన్ ‘ది క్రూ’ అనే సినిమా చేసింది. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇందులో కృతి సనన్ తో పాటుగా టబు, కరీనా కపూర్ యాక్ట్ చేశారు. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సస్పెన్స్ డ్రామాకు సినిమా లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో కృతి సనన్ బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

సాధారణంగానే బాలీవుడ్ మీద ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇక్కడ అంతా మేల్ డామినేషన్ ఉంటుది అంటూ చాలామంది హీరోయిన్స్ ఆరోపణలు చేశారు. తమకు కనీస గుర్తింపు కూడా ఉండదు అంటూ వాపోయారు. ఇంకొంత మంది హీరోలతో సమానంగా తమకు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ గొంతెత్తారు. తమ పరిస్థితి ఇండస్ట్రీలో దారుణంగా ఉంటుందంటూ చాలా మంది హీరోయిన్స్ ఏదో ఒక సందర్భంలో వాపోతూనే ఉన్నారు. తాజాగా కృతి సనన్ ది క్రూ సినిమా సక్సెస్ ని ఉదాహరణగా చూపిస్తూ బాలీవుడ్ హీరోలకు చురకలు అంటించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Kruthi sanon

కృతి సనన్- టబు- కరీనా కపూర్ కాంబోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కలెక్షన్స్ కూడా నెక్ట్స్ లెవల్లోనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కృతి సనన్ కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. “ది క్రూ సినిమా చాలా బాగా ఆడుతోంది. ఈ మూవీ ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసింది. ఈ మూవీలో లీడ్ రోల్స్ ప్లే చేసిన ముగ్గురు ఆడవాళ్లే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. స్టార్ హీరోలు లేకపోయినా కథలో విషయంలో ఉంటి సక్సెస్ అవుతుంది. కథ బాగుంటే అక్కడ ఉంది ఆడా.. మగా తారతమ్యాన్ని అభిమానులు చూపించరు. కానీ, దురదుష్టవశాత్తు కొందరు దర్శక నిర్మాతలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు అనే భావనలోనే ఉన్నారు.

ప్రేక్షకులు కూడా ఒక విషయంలో మారాలి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకి తాము పెట్టే టికెట్ డబ్బులు వృథా అనే అభిప్రాయంలో ఉంటారు. మాలాంటి వాళ్ల సినిమాలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అంటూ కృతి సనన్ కామెంట్స్ చేసింది. పేరుకి దర్శనక నిర్మాతలు అంటున్నా.. పరోక్షంగా బాలీవుడ్ హీరోలకు కూడా కృతి సనన్ కౌంటర్ వేసిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొందరు మాత్రం కృతి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ బాలీవుడ్ హీరోలకు కౌంటర్స్ వేస్తున్నారు. కృతి సనన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobet girişjojobet