iDreamPost

కృష్ణంరాజుకి మొదటి భార్య అంటే ఎనలేని ప్రేమ.. మా పెళ్లి ఎలా జరిగిందంటే?

ఇప్పటి తరం నటులకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పనక్కర్లేదు కానీ .. అతడికి నటుడిగా ప్రాణం పోసిన మరో స్టార్ ఉన్నారు. ఆయనే వాళ్ల పెద్దనాన్న కృష్ణం రాజు. టాలీవుడ్ ఒకప్పటి అగ్రనటుల్లో ఆయన ఒకరు. కృష్ణం రాజు నుండి వారసత్వాన్ని తీసుకుని వచ్చాడు డార్లింగ్.

ఇప్పటి తరం నటులకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పనక్కర్లేదు కానీ .. అతడికి నటుడిగా ప్రాణం పోసిన మరో స్టార్ ఉన్నారు. ఆయనే వాళ్ల పెద్దనాన్న కృష్ణం రాజు. టాలీవుడ్ ఒకప్పటి అగ్రనటుల్లో ఆయన ఒకరు. కృష్ణం రాజు నుండి వారసత్వాన్ని తీసుకుని వచ్చాడు డార్లింగ్.

కృష్ణంరాజుకి మొదటి భార్య అంటే ఎనలేని ప్రేమ.. మా పెళ్లి ఎలా జరిగిందంటే?

ఒకప్పటి తరం నటుల్లో అగ్ర తారగా వెలుగొందారు కృష్ణం రాజు. టాలీవుడ్ రెబల్ స్టార్‌గా ముద్ర పడ్డ ఆయన.. 180కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్.. కృష్ణం రాజు సోదరుడు కుమారుడు అన్న సంగతి విదితమే. అంటే ప్రభాస్‌కు పెద్దనాన్న.  పశ్చిమ గోదావరి జిల్లా మెగల్తూరులో పుట్టిన కృష్ణం రాజు, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్‌పై పలు సినిమాలు తెరకెక్కించారు. 2022లో సెప్టెంబర్ 11న ఆయన తుది శ్వాస విడిచారు. జనవరి 20వ తేదీ ఆయన జయంతి సందర్భంగా సతీమణి శ్యామలా దేవీ పలు విషయాలను ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకున్నారు.

కృష్ణం రాజు లైఫ్‌లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. రెండవ సారి పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఆడపిల్లలు కొంచెం ఆలోచిస్తారు. కానీ మీరు ఎలా బ్రాడ్ గా ఆలోచించారు అని ప్రశ్నించగా.. శ్యామలా దేవి స్పందించారు. ‘కృష్ణం రాజు తన మొదటి భార్య సీతాదేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ అనుకోకుండా కంచి షాపింగ్‌కు వెళుతుండగా.. కార్ యాక్సిడెంట్‌లో ఆమె చనిపోయింది. కృష్ణంరాజుకు మర్చిపోలేని విషాదం. తట్టుకోలేని బాధ. ఆయన ఒంటరి అయిపోయారు. కృష్ణంరాజుకు తల్లిదండ్రులకు విపరీతమైన ఇష్టం. అన్నం మానేసి ఆయన బాధ పడుతుంటే.. తండ్రి చూసి దిగులు చెందారు. నా కొడుక్కి ఎలాగైనా పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే ఎవరు అడగాలన్న సందిగ్దతలో ఉండిపోయారు’అని చెప్పారు శ్యామలా దేవి.

‘సీతాదేవి అంటే అమితంగా ప్రేమించే వ్యక్తి. అయితే ఈ పెళ్లి ప్రపోజల్ ఎవరు తీసుకురావాలని ఆలోచించి ఎట్టకేలకు తండ్రి అడిగారు. నువ్వు రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనని చెప్పారు. అయితే ఆయన తిరస్కరించారు. దీంతో తండ్రి భోజనం మానేసి.. ఊ అన్న రోజే తింటానని నిరాహార దీక్ష చేయడంతో ఒప్పుకున్నారట. అలా సంబంధాలు వెతకడం స్టార్ చేశారు. అలాగే నాకు చిన్నప్పుడు పూజలు, భక్తి ఎక్కువ. మా అమ్మ దానం, ధర్మం గురించి మాట్లాడుకునేటప్పుడు కృష్ణం రాజు గొప్ప వ్యక్తి అని, ఆయన ధాన ధర్మాలు చేస్తారని మాట్లాడుకునే వారు. నేను అప్పుడు విన్నాను. కానీ అనుకోకుండా మా చుట్టాల ద్వారా ఈ మ్యాచ్ వచ్చింది. అలా ఓ మంచి అమ్మాయి ఉంది తెలుసుకుని మా దగ్గరకు వచ్చారు. మా అమ్మకు చెప్పారు. కానీ మా అమ్మకు ఇష్టం లేదు. నన్ను అడిగారు.. నేను వెంటనే ఒప్పేసుకున్నా’ అని చెప్పాను అని తెలిపారు.

‘నేను చేసుకుంటాను అన్నాను. కానీ కృష్ణం రాజు ఒప్పుకోలేదు. అమ్మాయిని బలవంతంగా ఒప్పించారు అని భావించి.. సీక్రెట్‌గా తన కజిన్‌ను పంపించారు. అంతలో వైజాగ్ వచ్చి నన్ను చూశారు కజిన్. పిల్లలతో ఆడుకుంటున్నా. అంతలో వచ్చి అడిగారు. కృష్ణం రాజును పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా.. మిమ్మల్ని ఎవరైనా ఒప్పించారా అని అడిగారు. కానీ నాకు ఇష్టం అని చెప్పాను. ఈ విషయం ఆయనకు తెలిసి.. ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు తమ పెళ్లి జరిగింది’అని చెప్పారు. కాగా, ఆయన జయంతి సందర్భంగా మెగల్తూరులో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు కుటుంబ సభ్యులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి