iDreamPost

జిల్లెడు పూలు అంత ఖరీదా.. కేజీ ధర ఏకంగా వేలల్లో.. సాగు చేస్తోన్న BJP నేత

  • Published Apr 13, 2024 | 4:09 PMUpdated Apr 13, 2024 | 4:09 PM

జిల్లెడు పూలంటే మనం పెద్దగా పట్టించుకోం. కానీ బయట మార్కెట్ లో వాటి ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేజీ ధర ఏకంగా వేల రూపాయలు పలుకుతుంది. చేవెళ్ల బీజేపీ నేత దీన్ని సాగు చేస్తున్నారు. ఆ వివరాలు..

జిల్లెడు పూలంటే మనం పెద్దగా పట్టించుకోం. కానీ బయట మార్కెట్ లో వాటి ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేజీ ధర ఏకంగా వేల రూపాయలు పలుకుతుంది. చేవెళ్ల బీజేపీ నేత దీన్ని సాగు చేస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 4:09 PMUpdated Apr 13, 2024 | 4:09 PM
జిల్లెడు పూలు అంత ఖరీదా.. కేజీ ధర ఏకంగా వేలల్లో.. సాగు చేస్తోన్న BJP నేత

జిల్లెడు మొక్క గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఏ ఊరిలో చూసిన జిల్లెడు మొక్కలు దర్శనం ఇస్తాయి. బంజరు భూములు, పొలాల గట్ల వెంట ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. ఊళ్లలో ఉండేవారు జిల్లెడు ఆకులు తెచ్చుకుని చుట్టలాగా చుట్టి.. దానిలో పొగాకు పెట్టి.. కాలుస్తుంటారు. అయితే జిల్లెడు పాలు విషం అని చెబుతారు. ఇవి కళ్లల్లో పడితే కంటి చూపు పోతుందంటారు. ఊర్లలో ఈ జిల్లెడు చెట్లను పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక తాజాగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత ఒకరు జిల్లెడు సాగు చేస్తూ.. భారీగా ఆర్జిస్తున్నారు. ఆ వివరాలు..

జిల్లెడు పూలను ఆలకంరణలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కొన్ని చోట్ల దేవుడి పూజకు కూడా వాడతారు. అదలా ఉంచితే.. జిల్లెడు పూలకు ఆలంకరణ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. కేజీ పూల ధర వేల రూపాయాల్లో పలుకుతుంది. పైగా బీజేపీ నేత, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి జిల్లుడు పూలు సాగు చేస్తూ.. భారీగా ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన జిల్లెడు సాగుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది.

ఇక జిల్లెడు పూలలో రెండు రకాలుంటాయని.. వంగపూవు రంగులో ఉండేవి విషపూరితమని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. వాటిని శివుడిని పూజించడానికి వాడతారని తెలిపారు. అయితే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. జిల్లెడులోనే మరో రకం తెలుపు రంగులో ఉంటాయని.. వీటికి డిమాండ్ ఎక్కవని తెలిపారు. ప్రస్తుతం ఇవి కేజీ రూ. 2,700 పలుకుతుందని చెప్పారు. ఈ పూలను డెకరేషన్ కోసం వాడతరాని అందుకే వీటికి అంత డిమాండ్ ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ పూలను థాయ్‌లాండ్ నుంచి మన దగ్గరకు దిగుమతి చేసుంటున్నారని వెల్లడించారు.

ఇక తెల్ల జిల్లేడు సాగుకు చేవెళ్ల ప్రాంతం ఎంతో అనువైనదని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో వర్షం తక్కువగా కురుస్తుందని.. అందుకే ఇక్కడ తెల్ల జిల్లెడు సాగు ఉత్తమమైనది అంటున్నారు. ఈ పంటకు నీరు ఎక్కువగా అవసరం లేదని.. అలాగే చీడ పీడలు, ఎరువులు వంటివి కూడా వేయాల్సిన పనిలేదని.. కలుపు తీసే అవసరం కూడా లేదని తెలిపారు. తాను ప్రస్తుతం ఎకరం పొలంలో ఈ పంటను సాగుచేస్తున్నానని చెప్పిన కొండా.. త్వరలోనే చేవెళ్ల ప్రాంతంలోని రైతులను తెల్ల జిల్లెడు సాగు వైపు మళ్లిస్తాను అన్నారు. ఇది సక్సెస్ అయితే లక్షల్లో లాభాలు ఆర్జించవచ్చు అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి