iDreamPost

పార్టీ మార్పుపై ప్రచారం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

  • Published Oct 24, 2023 | 11:37 AMUpdated Oct 24, 2023 | 11:37 AM

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

  • Published Oct 24, 2023 | 11:37 AMUpdated Oct 24, 2023 | 11:37 AM
పార్టీ మార్పుపై ప్రచారం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

తెలంగాణలో ఎన్నికల రోజు రోజుకీ రసవత్తరంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్దం నడుస్తుంది. బీఆర్ఎస్ ఈసారి ఓటమి పాలవుతుందని తమపై లేని పోని ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు తమపై లేనిపోని అపనిందలు వేస్తున్నారని.. ఈసారి కూడా తెలంగాణ లో తమ పార్టీ జెండా ఎగురవేస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికి వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీనిపై ఆయన సోమవారం క్లారిటీ ఇచ్చారు.

నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ లో కీలక నేతలుగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గినప్పటికీ నల్లగొండలో మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ తమ సత్తా చాటుతూ వచ్చారు. ఇటీవల కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఆ పార్టీ వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థు పేర్లు ఖరారు చేసి బీ-ఫారాలు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది. బీజేపీ 52 మంది అభ్యర్థుల పేర్లు రిలీజ్ చేసింది. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల పేర్లలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి పేరు ఏ నియోజకవర్గం నుంచి అనేది ఖరారు చేయలేదు. వాస్తవానికి ఆయన మునుగోడు, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు అదిష్టానానికి వెల్లడించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సొంతగూటికి వెళ్లనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ విషయంపై సోమవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనపై తన పోరాటం కొనసాగుతుంది.. ప్రజలు, మునుగోడు కార్యకర్లు, తన అనుచరుల ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయం ఉంటుందని అన్నారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్ పై తన పోరాటం ఆగదని అన్నారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవొద్దని అన్నారు. మరి ఆయన రాబోయే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తారా? కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా అనేది రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి