iDreamPost

Kiran Abbavaram: వీడియో: ప్రేయసితో కిరణ్ అబ్బవరం ఎంగేజ్​మెంట్.. చాలా సింపుల్​గా..!

  • Published Mar 13, 2024 | 9:09 PMUpdated Mar 13, 2024 | 9:26 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ఐదేళ్ల ప్రేమను నిజం చేసుకున్నారు. ప్రేయసి రహస్య గోరక్​తో ఆయన ఎంగేజ్​మెంట్ వేడుక ఇవాళ వైభవంగా జరిగింది.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ఐదేళ్ల ప్రేమను నిజం చేసుకున్నారు. ప్రేయసి రహస్య గోరక్​తో ఆయన ఎంగేజ్​మెంట్ వేడుక ఇవాళ వైభవంగా జరిగింది.

  • Published Mar 13, 2024 | 9:09 PMUpdated Mar 13, 2024 | 9:26 PM
Kiran Abbavaram: వీడియో: ప్రేయసితో కిరణ్ అబ్బవరం ఎంగేజ్​మెంట్.. చాలా సింపుల్​గా..!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా జరిగింది. ప్రేయసి రహస్య గోరక్​తో తన ఐదేళ్ల ప్రేమను ఆయన నిజం చేసుకున్నారు. హైదరాబాద్​లో కొంతమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ ఎంగేజ్​మెంట్ వేడుక జరిగింది. ఈ ఫంక్షన్​లో కిరణ్ అబ్బవరం పింక్ కలర్ షేర్వాణీలో చాలా సింపుల్​గా దర్శనమిచ్చారు. రహస్య గోరక్ గ్రీన్ కలర్ శారీలో మెరిశారు. వీళ్ల నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు ప్రముఖులు హాజరయ్యారు. కిరణ్ అబ్బవరం ఎంగేజ్​మెంట్ సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

కిరణ్ అబ్బవరంకు సోషల్ మీడియాలో నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆడియెన్స్ కూడా ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఇక, షార్ట్ ఫిల్మ్స్​తో ఫేమ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో 2019లో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇదే మూవీలో రహస్య గోరక్ హీరోయిన్​గా యాక్ట్ చేశారు. ఈ సినిమా టైమ్​లోనే కిరణ్, రహస్య మధ్య ప్రేమ చిగురించింది. అదే లవ్​ షిప్​లో ఇన్నాళ్లూ జర్నీ చేస్తున్న వచ్చిన ఆ ఇద్దరు.. త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. ఎంగేజ్​మెంట్ అయిపోవడంతో నెక్స్ట్ వాళ్ల మ్యారేజ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక, ‘రాజా వారు రాణి గారు’ చిత్రం తర్వాత ‘సర్బాత్’ అనే ఓ తమిళ మూవీలో మాత్రమే యాక్ట్ చేశారు గోరక్. అనంతరం ఆమె ఇంకో సినిమా ఏదీ చేయలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్​గా ఉంటూ ప్రేక్షకులతో టచ్​లో ఉంటున్నారు.

ఇక, కిరణ్​ అబ్బవరం గత సంవత్సరం ఏకంగా మూడు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఆయన నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ సినిమాలు 2023లో రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా కిరణ్ పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టుకోలేదు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. దీంతో నెక్స్ట్ ఫిల్మ్​తో ఎలాగైనా పెద్ద హిట్టు కొట్టాలని కిరణ్​ అబ్బవరం పట్టుదలతో ఉన్నారు. ఈ తరుణంలో ఎంగేజ్​మెంట్ వేడుకతో ఆయన మరోమారు వార్తల్లో నిలిచారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి