iDreamPost

Kinnera Mogulaiah: మీ పద్మశ్రీ తిరిగిచ్చేస్తా, నా నోట్లె మన్నుపోయొద్దు.. మొగులయ్యకు ఎందుకంత‌ ఆవేదన?

Kinnera Mogulaiah: మీ పద్మశ్రీ తిరిగిచ్చేస్తా, నా నోట్లె మన్నుపోయొద్దు.. మొగులయ్యకు ఎందుకంత‌ ఆవేదన?

కిన్నెర మొగుల‌య్య‌ ఒక్క‌సారిగా భావోద్వేగానికి గురైయ్యాడు. 12 మెట్ల కిన్నెరను వాయించే ఏకైక అరుదైన ఈ కళాకారుడు, భీమ్లా నాయక్‌ టైటిల్‌ సాంగ్ ఫేమ్ తో పాపుల‌ర్ అయ్యాడు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో మొగులయ్యను సత్కరించింది. ఇప్పుడు ఆ పుర‌స్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు. ఆయ‌న వేద‌న‌కూ కార‌ణ‌ముంది.

‘నన్ను ఎవ‌రూ, ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు కానీ, తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. పద్మశ్రీ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. హైదరాబాద్‌లో, 300 గజాల స్థలం, రూ. కోటి ఇచ్చారు. కాని, బీజేపీ వాళ్లు ముఖ్యమంత్రి తన ఇంట్లో నుంచి కోటి రూపాయలు ఇస్తున్నడా? అని నాతో గొడవపడ్డారు. పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట. నాకు ఆ పతకమే అవసరం లేదు. నాకు ఎందుకీ బద్నాం. పద్మశ్రీ ఎవరిదైనా సరే, తిరిగి ఇచ్చేస్తా. పేదోడిని అయిన నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతది’ అని ఆవేదన చెందారు మొగులయ్య.

అస‌లేమైంది?
ప‌ద్మశ్రీ పురస్కారం సంద‌ర్భంగా కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్యను సీఎం కేసీఆర్ స‌త్క‌రించారు.రూ. కోటి నజరానా ప్రకటించారు. తాజాగా దీని గురించి ఓ బీజేపీ నేత మొగులయ్యను ఆరా తీశారు. ఏ ఎక్కడిది, ఇంకా రాలేద‌ని తన కుటుంబ సమస్యలను మొగులయ్య చెప్పుకున్నారు. ఆ వీడియోను రికార్డును చేసిన ఆ బీజేపీ నేత సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏంది కేసీఆర్ ఇది కూడా ఉత్తదేనా అంటూ సైటైర్లు వేస్తూ కామెంట్స్ చేశారు.

ఇది కాస్తా మొగులయ్య దృష్టికి తీసుకెళ్ల‌డంతో ఆయ‌న ఆవేద‌న చెందారు. వీడియోను రికార్డు చేయ‌డంప‌ట్ల బాధ‌ప‌డ్డారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.కోటిని ప్రస్తావిస్తూ, తన నోట్లె మన్ను కొట్టవద్దని వేడుకున్నారు. తనను టీఆర్ఎస్ ప్రభుత్వమే గుర్తించిందన్నారు.

రూ.కోటి తన ఇంటి నుంచే కేసీఆర్ ఇస్తున్నాడా? ఎందుకివ్వడంటూ కొందరు బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్న‌ది మొగుల‌య్య‌ ఆవేదన.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి