iDreamPost

రూ.9 కోట్లు తీసుకొని ఎగ్గొట్టాడు.. కిచ్చా సుదీప్​పై ప్రొడ్యూసర్ సంచలన ఆరోపణలు!

  • Author singhj Published - 05:43 PM, Tue - 4 July 23
  • Author singhj Published - 05:43 PM, Tue - 4 July 23
రూ.9 కోట్లు తీసుకొని ఎగ్గొట్టాడు.. కిచ్చా సుదీప్​పై ప్రొడ్యూసర్ సంచలన ఆరోపణలు!

కిచ్చా సుదీప్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఈగ’ సినిమాతో తెలుగులో ఆయన స్టార్ ఇమేజ్ సంపాదించారు. ఆ మూవీలో నెగిటివ్ రోల్​లో అద్భుతంగా యాక్ట్ చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా సుదీప్ వాయిస్​కు తెలుగు వారు ఫిదా అయ్యారు. అయితే ‘ఈగ’ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు సుదీప్. ఒక్క ‘బాహుబలి’లోనే క్యామియో రోల్ చేశారు. సొంత ఇండస్ట్రీ శాండల్​వుడ్​లో మాత్రం రెగ్యులర్​గా సినిమాలు చేస్తున్నారాయన. గతేడాది ‘విక్రాంత రోణా’తో మర్చిపోలేని హిట్​ అందుకున్నారు కిచ్చా సుదీప్. ఈ సినిమా అటు కన్నడతో పాటు ఇటు తెలుగు నాట కూడా మంచి హిట్​గా నిలిచింది.

‘విక్రాంత రోణా’ తర్వాత తదుపరి ప్రాజెక్టులపై సుదీప్ ఫోకస్ చేస్తున్నారు. భారీ మూవీస్​ను తీసే ప్రొడ్యూసర్ కలైపులి ఎస్​ థాను నిర్మిస్తున్న కిచ్చా 46కు సంబంధించిన టీజర్​ను కూడా మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేశారు. ఇలాంటి తరుణంలో ఈ స్టార్ హీరోపై ఒక నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. తమ బ్యానర్​లో ఒక మూవీ చేస్తానని చెప్పి.. రెమ్యూనరేషన్ కూడా తీసుకొని కిచ్చా సుదీప్ సినిమా చేయకుండా మోసం చేశారని ప్రొడ్యూసర్ ఎమ్​ఎన్​ కుమార్ ఆరోపించారు. కొత్త ప్రాజెక్ట్ కోసం సుదీప్ తమ నుంచి రూ.9 కోట్లు తీసుకున్నారని ఎమ్​ఎన్ కుమార్ ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకొని డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని తెలిపారు.

కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర ఈ విషయంపై ఇప్పటికే కంప్లయింట్ చేశానన్నారు నిర్మాత ఎమ్​ఎన్ కుమార్. తమ మధ్య సినిమా చేయడానికి సుమారు 8 ఏళ్ల కింద అగ్రిమెంట్ కుదిరిందన్నారు. కానీ ఇప్పటిదాకా కాల్షీట్స్ కేటాయించడంలో సుదీప్ ఫెయిలయ్యారని చెప్పుకొచ్చారు. పూర్తి రెమ్యూనరేషన్​తో పాటు మరో రూ.10 లక్షలు తన ఇంటి కిచెన్ రెనోవేషన్ కోసం సుదీప్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్​కు అడ్వాన్స్ చెల్లించడంతో పాటు మూవీకి ‘ముత్తటి సుబ్బరాజు’ అనే టైటిల్​ను ఫిలిం ఛాంబర్​లో రిజిస్టర్ చేయించామన్నారు నిర్మాత కుమార్. తన దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత వివిధ నిర్మాతలతో సుదీప్ నాలుగు సినిమాలు చేశాడని.. కానీ తమ బ్యానర్​లో మాత్రం మూవీ చేయడం లేదన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి