iDreamPost

IPL 2024: ఉప్పల్‌లో మ్యాచ్‌ జరగనివ్వం! సన్‌రైజర్స్‌కు MLA దానం నాగేందర్‌ వార్నింగ్‌

ఉప్పల్ లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగనివ్వమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ సందర్భంగా సన్ రైజర్స్ యాజమాన్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి దానం ఈ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి?

ఉప్పల్ లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగనివ్వమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ సందర్భంగా సన్ రైజర్స్ యాజమాన్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి దానం ఈ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి?

IPL 2024: ఉప్పల్‌లో మ్యాచ్‌ జరగనివ్వం! సన్‌రైజర్స్‌కు MLA దానం నాగేందర్‌ వార్నింగ్‌

క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తూ.. ఐపీఎల్ 2024 సీజన్ ముందుకు సాగుతోంది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లు ప్రేక్షకులకు ఫుల్ కిక్కిస్తున్నాయి. ఇక ఈ టోర్నీలో భాగంగా మరో కీలక పోరు జరగనుంది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్ ఐపీఎల్ లో హైదరాబాద్ టీమ్ లో లోకల్ ప్లేయర్లు లేకపోతే.. ఉప్పల్ స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా జరగనివ్వనని వార్నింగ్ ఇచ్చారు.

సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మధ్య ఉప్పల్ వేదికగా కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైయ్యాయి. కాగా.. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ను చూడాలని ఆశపడిన కొందరికి టికెట్లు దొరక్క నిరాశకు గురైయ్యారు. ఇదిలా ఉండగా.. చెన్నై-హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సన్ రైజర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..”వచ్చే ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో లోకల్ ప్లేయర్లు లేకపోతే.. ఉప్పల్ లో ఒక్క మ్యాచ్ కూడా జరగనివ్వం. మేమందరం గ్రౌండ్ లో ధర్నా చేస్తాం. నా మీద కేసులు అయినా పర్వాలేదు” అంటూ SRH యాజమాన్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే దానం.

MLA warning to SRH!

ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విషయంపై కూడా దానం నాగేందర్ ఈ సందర్భంగా స్పందించారు. ఆన్ లైన్ లో టికెట్ అమ్మకాలు పెట్టడం వల్ల సామాన్యులకు టికెట్లు దొరకడం లేదని ఆయన తెలిపారు. అలాగే అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాలకే టికెట్లన్నీ అమ్ముడైపోయినట్లు చూపిస్తున్నాయని దానం ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్ కమింగ్ లోకల్ ప్లేయర్లు తమ అభిమానులు ఆటను చూడాలని ఎంతో ఆశపడతారని, చిన్న పిల్లలతో సహా వారు వచ్చి రోడ్లపై టికెట్ల కోసం నిరీక్షిస్తున్నారని కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఏం పట్టించుకోవట్లేదని విమర్శించాడు. అసోషియేషన్ లో కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. మరి దానం చెప్పినట్లుగా వచ్చే ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ కు చెందిన లోకల్ ప్లేయర్లను టీమ్ లోకి తీసుకుంటారా? లేదా? అన్నది తెలియాలంటే వచ్చే సీజన్ వేలం పాట వరకు ఆగాల్సిందే. మరి లోకల్ ప్లేయర్లకు అండగా నిలుస్తూ.. ఎమ్మెల్యే దానం SRH యాజమాన్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి