iDreamPost

Beast movie బీస్ట్ – ఇంత అవమానమా

Beast movie బీస్ట్ – ఇంత అవమానమా

KGF 2 రిలీజ్ డేట్ ని ఎప్పుడో ఆరు నెలల క్రితం ఏప్రిల్ 14 ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. కానీ విజయ్ బీస్ట్ మాత్రం ఉన్నట్టుండి ఏప్రిల్ 13ని సడన్ గా ఓ నెల రోజుల ముందు అఫీషియల్ గా లాక్ చేసుకుంది. తమిళనాడులో కెజిఎఫ్ మీద దీని ప్రభావం ఉంటుందని తెలిసినా యష్ నిర్మాతలు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. దానికి తగ్గట్టే రాఖీ భాయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అదరగొడుతున్నాడు. కానీ బీస్ట్ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారయ్యింది. నార్త్ లో రా టైటిల్ తో డబ్ద్ వెర్షన్ విడుదల చేస్తే రెండో రోజే కనీస ఆక్యుపెన్సీ లేక చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. ఒకటి రెండు థియేటర్లలో సింగల్ టికెట్లు అమ్ముడుపోయిన దాఖలాలు ఉన్నాయి.

సరే విజయ్ కు స్వంత రాష్ట్రంలో భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది కదాని అక్కడేదో హౌస్ ఫుల్ బోర్డులతో రచ్చ చేయడం లేదు. అరవ ఆడియన్స్ కూడా కెజిఎఫ్ 2కే ఓటు వేస్తున్నారు. కాకపోతే బీస్ట్ కు ముందస్తు అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లు ఆ నిబంధనలు మీరలేక సగం సీట్లు నిండకపోయినా కూడా విజయ్ సినిమానే ఆడించాల్సి వస్తోంది. కెజిఎఫ్ డిమాండ్ ని తట్టుకునేందుకు అర్ధరాత్రి 12 నుంచి ఉదయం ఆరు మధ్యలో రెండు మూడు షోలు రాఖీ భాయ్ కు వేస్తున్నారు. అంత వేళకాని వేళలోనూ సీట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోవడం గమనార్హం. బీస్ట్ మాకొద్దు మహాప్రభో అని స్వయంగా ఫ్యాన్సే వేడుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ వచ్చిందని సన్ పిక్చర్స్ బీస్ట్ గురించి పబ్లిసిటీ చేసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం గప్ చుప్ అయిపోయారు. ముఖ్యంగా ఏపీ తెలంగాణతో సహా దేశంలోని చాలా చోట్ల బీస్ట్ కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. కెజిఎఫ్ 2 మరీ ఇంత చావు దెబ్బ తీస్తుందని ఊహించలేకపోయారు. అయినా పోటీ సంగతి కాసేపు పక్కనపెడితే అంత నాసిరకం కంటెంట్ ఉంటే విజయ్ మాత్రం ఏం చేయగలడు. కేవలం బిజినెస్ లెక్కలు చూసుకుని కథలను లైట్ తీసుకుంటే ఎంత పెద్ద స్టార్ కైనా ఇలాంటి అవమానాలు తప్పవు. సోషల్ మీడియాలో బీస్ట్ మీద ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అంత దారుణంగా దెబ్బ తింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి