iDreamPost

మెడికో రచనా రెడ్డి మృతి కేసులో కీలక అప్ డేట్

మెడికో రచనా రెడ్డి మృతి కేసులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డులో కారులో అపస్మారక స్థితిలో ఉన్న రచనా రెడ్డిని గమనించిన వాహనదారులు.. అమీనాపూర్ పోలీసులకు ఫోన్ చేశారు. కాగా, ఈ కేసులో కీలక అప్డేట్ ఇచ్చారు.

మెడికో రచనా రెడ్డి మృతి కేసులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డులో కారులో అపస్మారక స్థితిలో ఉన్న రచనా రెడ్డిని గమనించిన వాహనదారులు.. అమీనాపూర్ పోలీసులకు ఫోన్ చేశారు. కాగా, ఈ కేసులో కీలక అప్డేట్ ఇచ్చారు.

మెడికో  రచనా రెడ్డి మృతి కేసులో కీలక అప్ డేట్

మెడికో రచనా రెడ్డి మృతి కేసులో చిక్కు ముడి వీడింది. సంగారెడ్డి జిల్లాలోని రామ చంద్రపురం నివాసి అయిన రచనా రెడ్డి.. ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది. రంగారెడ్డి జిల్లాలోని బాచుపల్లిలోని ఓ మెడికల్ కాలేజీలో గైనకాలజీలో ఇంటర్న్ షిప్ చేస్తోంది. ఆమె చదువు మరికొన్ని రోజుల్లో ముగియనుండగా.. దారుణానికి పాల్పడింది. సోమవారం ఉదయం మెడికల్ కాలేజీకి బయలుదేరిన రచనా.. ఔటర్ రింగ్ రోడ్డులో కారులో ఆత్మహత్యకు ఒడిగట్టింది. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డి పేట్ ప్రాంతంలో కారులో ఉంటూనే పాయిజన్ ఇంజెక్ట్ చేసుకుంది. అనంతరం అపస్మారక స్థితిలోకి జారిపోయింది.

కారులో అపస్మారక స్థితిలో పడి ఉన్న రచనను గమనించిన వాహనదారులు.. అమీనాపూర్ పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్న అనంతరం.. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 4 గంటలకు మరణించింది. కాగా, ఈ కేసులో కీలక విషయాలను వెల్లడించారు పోలీసులు. రచనాకు గత నవంబర్‌లో ఓ యువకుడితో నిశ్చితార్ధం జరిగింది. మార్చిలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇంతలో అతడితో మనస్పర్థలు రావడంతో రచన బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ రచనా కొన్ని రోజుల నుండి డిప్రెషన్‌లో ఉంది, చాలా సార్లు అలా ఉండొద్దు అని చెప్పాం, మాపేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు’ చెప్పారని పేర్కొన్నారు. కారులో కొన్ని సిరింజీలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణం ఎఫ్ఎస్ఎల్‌లోనే తేలుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలోనే రచనా రెడ్డి మృతదేహం ఉంది. అలాగే ఆమె మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని.. తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఎలా చనిపోయిందో దర్యాప్తులో తేలుతుందని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి