iDreamPost

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ స్కీమ్ లేటెస్ట్ అప్డేట్స్.. రానివాళ్లకు మరో ఛాన్స్!

Key Update for Subsidy Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు.

Key Update for Subsidy Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు.

రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ స్కీమ్ లేటెస్ట్ అప్డేట్స్.. రానివాళ్లకు మరో ఛాన్స్!

తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగ్విజయం సాధించింది. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుందుకు కృషి చేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.10 లక్షల బీమా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక రూ.500 కే గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాల అమలుకు ఏర్రాట్లు చేస్తున్నారు అధికారు. తాజాగా అర్హుల ఎంపిక విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ లో ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా గృహ జ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇవ్వనుంది. అలాగే మహాలక్ష్మి పథకం లో భాగంగా రూ.500 లకే గ్యాస్ అందించనుంది. ఈ రెండు గ్యారెంటీలను ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి చేవెళ్ల వేదికగా తెంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఈ పథకాల కోసం క్షేత్రస్థాయి లో ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తయ్యింది. ఇటీవల ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. వీటికోసం అప్లై చేసుకున్న వివరాలు పరిశీలించింది. ఈ రెండు స్కీమ్ లకు ప్రధాన ప్రామాణికంగా తెల్లరేషన్ కార్డును తీసుకున్నారు. దీనికి ఆధార్ లింకింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది.

అర్హుల ఎంపిక విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ పథకాలకు పలు పత్రాలు లేని కారణంగా చాలా మంది అర్హత పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, గ్యాస్ స్కీమ్ లకు అర్హత పొందలేని వారు నిరాశపడవొద్దని, దరఖాస్తు చేసుకోలేని వారు మండల ఆఫీసుల్లో అప్లై చేసుకోవాలని సూచించారు. ఇందుకు కావాల్సిన పత్రాలు అక్కడ సమర్పించుకోవచ్చని సూచించారు. మండలాధికారులు వారి వివరాలు ఆన్ లైన్ లో ఎంట్రీ చేసి వచ్చే నెల నుంచి అర్హుల జాబితాలో కొత్తవారి పేర్లు చేర్చాలని చెప్పారు. ఈ కార్యక్రమం నిరంతరంగా ఉంటుందని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి