iDreamPost

దేశంలోనే తొలి ప్రభుత్వ OTT ప్లాట్ ఫామ్.. 75 రూపాయలకే..

Kerala Govt OTT CSpace: ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ప్రత్యక్షం అవుతున్నాయి.

Kerala Govt OTT CSpace: ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ప్రత్యక్షం అవుతున్నాయి.

దేశంలోనే తొలి ప్రభుత్వ OTT ప్లాట్ ఫామ్.. 75 రూపాయలకే..

ఒకప్పుడు ధియేటర్లో సినిమాలు చూడటానికి ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ విషయంలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఓటీటీ పుణ్యమా అని హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసే అవకాశం లభిస్తుంది. ఒక్క భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, హర్రర్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మద్య కొన్ని నిర్మాణ సంస్థ డైరెక్ట్ గా ఓటీటీలోకే తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు ధియేటర్లో హిట్ కాకున్నా.. ఓటీటీలో అద్భుత విజయం సాధించాయి. తాజాగా కేరళాలో ‘స్పీస్పేస్’ పేరుతో ఓటీటీ సర్వీస్ లను అందించేందుకు సిద్దమైంది అక్కడి ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే..

ఎంటర్‌టైన్మెంట్ ప్రేమికుల కోసం ఇప్పటి వరకు ఎన్నో ఓటీటీ యాప్ లు వచ్చాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ధియేటర్ల కంటే ఓటీటీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందుకే కేరళా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కేరళ గవర్నమెంట్ సొంతంగా ఓ ఓటీటీ యాప్ ని రిలీజ్ చేసింది. కేరళ ‘స్పీస్పేస్’ అనే ఓటీటీ ఫ్లాట్ ఫాం ను సీఎం పినరైయ్ విజయ్ కుమార్ ప్రారంభించారు. దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ అయిన సీస్పేస్ ను కేరళ స్టేట్ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సీస్పేస్ ఫ్లాట్ ఫామ్ ని అభివృద్ది చేసిందని కేరళ సాంస్కృతిక శాఖామంత్రి సాజీ చెరియాన్ అన్నారు.

ఓటీటీలో ప్రసారం అవుతున్న కంటెంట్ ఎంపికలో చాలా తేడాలు ఉన్నాయని కేఎస్ఎఫ్‌డీసీ చైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు. ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అన్నారు. సీస్పేస్ పే ఫర్ వ్యూ మోడల్ పై సినిమా యూజర్ల నుంచి కేవలం రూ.75 వసూలు చేస్తుంది. 60 మంది క్యూరేటర్ల ప్యానెల్ సమక్షంలో ఈ స్పీస్పేస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహకారంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని సీస్పేస్ నడుస్తుంది. సీస్పేస్ కోసం ఇప్పటి వరకు 42 సినిమాలు ఎంపిక చేశామని.. ప్యానెల్ అనుమతి పొందిన షార్ట్ ఫిలిమ్, డాక్యుమెంటరీలు, ప్రయోగాత్మక చిత్రాలు స్ట్రీమింగ్ చేస్తారు. ఇందులో వచ్చిన లాభాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధి లేని వారికి ఉపయోగించనున్నట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి