iDreamPost

పండగ ఆఫర్.. బైక్ పై ఏకంగా రూ.60 వేల తగ్గింపు.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!

  • Published Jan 08, 2024 | 4:03 PMUpdated Jan 08, 2024 | 4:03 PM

Kawasaki: పండుగ సందర్భంగా బైక్ కొనాలనుకునే వారికి.. కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. బైక్ మీద ఏకంగా 60 వేల రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు..

Kawasaki: పండుగ సందర్భంగా బైక్ కొనాలనుకునే వారికి.. కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. బైక్ మీద ఏకంగా 60 వేల రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published Jan 08, 2024 | 4:03 PMUpdated Jan 08, 2024 | 4:03 PM
పండగ ఆఫర్.. బైక్ పై ఏకంగా రూ.60 వేల తగ్గింపు.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!

మన దగ్గర సాధారణ రోజుల్లో కన్నా పండుగలు, ఇతర స్పెషల్ డేస్ లో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇయర్ ఎండ్, కొత్త ఏడాది, పండుగల వేళ అమ్మకాలు పెంచుకోవడం కోసం మాల్స్, ఆటోమొబైల్స్ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీలు భారీ ఎత్తున ఆఫర్లు, తగ్గింపు ధరలు ప్రకటిస్తాయి. కస్టమర్లను ఆకర్షించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. ఈ క్రమంలో తాజాగా కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఓ బైక్ కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 60 వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది. ఆ వివరాలు..

సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ద్విచక్ర వాహానాల తయారీ కంపెనీ అయిన కవాసకి ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. గత నెలలోనే ఈ ఆఫర్ ని తీసుకురాగా.. సంక్రాంతి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నెలాఖరు వరకు అంటే జనవరి 31, 2024 వరకు ఆఫర్ ను పొడిగించింది. దీనిలో భాగంగా తమ కంపెనీకి చెందిన వివిధ మోడళ్ల బైక్స్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది కవాసాకి ఇండియా.

ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కవాసకి ఇండియా తను తయారు చేసిన బైక్ ల మీద అనేక రకాల బెనిఫిట్స్ అందిస్తోంది. కవాసకి నింజా 400, వాల్కన్ ఎస్, నింజా 650, కవాసకి వెర్సిస్ 650 బైక్స్ పై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ జనవరి 31, 2024 లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తగ్గింపు అమౌంట్ ని వోచర్స్ రూపంలో అందిస్తుంది. దీనిలో జీఎస్‌టీ కలిసి ఉంటుందని కంపెనీ తెలిపింది.

దేనిపై ఎంత తగ్గింపు అంటే..

  1. కవాసకి నింజా 400 బైక్‌ను కొనుగోలు చేస్తే 40 వేల వరకు వోచర్స్ వస్తాయి. అంటే 40 వేల తగ్గింపు లభిస్తున్నట్లవుతుంది.
  2. కవాసకి వాల్కన్ ఎస్ క్రూయిజర్ బైక్ పై ఏకంగా రూ.60 వేల వరకు తగ్గింపు అందిస్తోంది.
  3. కవాసకి నింజా 650 బైక్ పై రూ. 30 వేల తగ్గింపు ఇస్తోంది.
  4. అడ్వెంచర్స్ టూరర్ బైక్ వైర్సిస్ 650 బైక్ పై రూ.20 వేల వరకు బెనిఫిట్స్ కల్పిస్తోంది.

ప్రస్తుతం కవాసకి నింజా 400 బైక్ ధర రూ.5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) వద్ద ఉంది. అలాగే నింజా 650 బైక్ ధర రూ. 7.16 లక్షలు, కవాసకి వాల్కన్ ఎస్ ధర రూ. 7.10 లక్షలుగా ఉండగా, కవాసకి వెర్సిస్ 650 ధర రూ. 7.77 లక్షలుగా ఉంది. అయితే ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. అలాగే.. కవాసకి ప్రకటించిన ఈ ఆఫర్ అనేది ప్రాంతం, డీలర్ షిప్ బట్టి మారుతుంటుందని గుర్తుంచుకోవాలి. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు తమ సమీపంలోని కవాసకీ బైక్ షోరూమ్ కి వెళ్లి ఆఫర్ వివరాలు ముందే తెలుసుకోవడం మంచిది అని సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి