iDreamPost

Karthikeya 2 కొత్త ఉత్సాహానిచ్చిన కార్తికేయ 2

Karthikeya 2 కొత్త ఉత్సాహానిచ్చిన కార్తికేయ 2

విడుదల విషయంలో ఎన్నో అవాంతరాలు ఎదురుకుని వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఎన్నో ఒత్తిళ్లను భరించి చివరికి థియేటర్లను ఇవ్వమని బెదిరించినా సరే వెనక్కు తగ్గకుండా శనివారం విడుదలకు రిస్క్ చేసి మరీ సిద్ధపడిన కార్తికేయ 2కి ఆశించిన దానికన్నా గొప్ప ఫలితమే దక్కుతోంది. మాచర్ల నియోజకవర్గంకు డిజాస్టర్ టాక్ రావడంతో బింబిసార, సీతారామం చూసేసిన ప్రేక్షకులు యునానిమస్ గా తమ ఓటుని నిఖిల్ కే వేస్తున్నారు. నార్త్ లో చాలా తక్కువ స్క్రీన్లు ఇచ్చినప్పటికీ టాక్ పాజిటివ్ గా రావడంతో ఒక్కసారిగా కౌంట్ 60 నుంచి 300 పైగా వెళ్లినట్టు ముంబై రిపోర్ట్. దీన్ని బట్టి కార్తికేయ 2 రీచ్ ఏ రేంజ్ లో వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు

కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లాల్ సింగ్ చడ్డాని దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలవంతంగా రన్ కొనసాగిస్తున్నారు. రెండో రోజే 1300 షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చినా పికప్ వస్తుందేమోనన్న అత్యాశతో అలాగే ఉంచేశారు. పరిస్థితి అంతకంతా దిగజారుతూ పోవడంతో కార్తికేయ 2కు మెల్లగా నెంబర్ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాచర్ల నియోజకవర్గంకు వచ్చిన ఫ్లాప్ టాక్ కూడా నిఖిల్ మూవీకి ప్లస్ అవుతోంది. అమెరికాలోనూ వెయ్యి దాకా షోలు హౌస్ ఫుల్ అవుతున్నట్టు ఓవర్సీస్ ట్రేడ్ రిపోర్ట్. థియేట్రికల్ బిజినెస్ కి మించి కార్తికేయ 2 పెర్ఫార్మ్ చేయడం బ్లాక్ బస్టర్ వైపు తీసుకెళ్తోంది

ఈ నెల 25న లైగర్ వచ్చేదాకా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. 19న విడుదలవుతున్న వాటి మీద మినిమమ్ బజ్ కనిపిస్తేగా. వాంటెడ్ పండుగాడ్ అనే కామెడీ మూవీ పెద్ద టీమ్ తోనే వస్తోంది కానీ కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రావడం కూడా అనుమానమే. ఒకవేళ బాగుందనే మాట బయటికి వస్తే అప్పుడు వసూళ్లను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. సో కార్తికేయ 2కి ఈజీగా ఇంకో పది రోజులు ఫ్రీ గ్రౌండ్ దొరకబోతోంది. మరోవైపు బింబిసార, సీతారామంలు స్లో అయ్యాయి కాబట్టి ఆ అవకాశాన్ని కూడా వాడుకోవాలి. లైగర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సరేసరి. లేదంటే కార్తికేయ 2 మళ్ళీ ఇంకో అవకాశం దక్కుతుంది. మొత్తానికి రెండేళ్ల నిరీక్షణకు నిఖిల్ దానికి తగ్గ ఫలితమే అందుకున్నాడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి