iDreamPost

కరోనా మృత్యుతాండవం

కరోనా మృత్యుతాండవం

చైనాలో కరోనా వైరస్‌ మృత్యుతాండవం చేస్తోంది. మంగళవారం నాటికి కరోనా వైరస్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 500లకు చేరింది. దాదాపు 24 వేల మంది ఈ వైరస్‌బారిన పడినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. జన సంచారం రద్దీగా ఉండే వుహాన్‌ నగర వీధులు బోసిపోయాయి. హాలివుడ్‌సినిమా సీన్‌ను తలదన్నేలా నగర వీధులు నిర్మానుష్యంగా మారాయి. కార్యాలయాలు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందకు చైనా తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. రికార్డు సమయంలో పలు ఆస్పత్రులు నిర్మించింది.

Read Also: కబళిస్తున్న కరోనా ..

హైదరాబాద్‌లో…

భారత్‌దేశంలోకి కూడా కరోనా వైరస్‌ పాకింది. కేరలో రెండు కేసులు నమోదవగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 50 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్యశాఖ ప్రకటించింది. అయితే ఈ కేసుల్లో పలువురికి వైద్య పరీక్ష ఫలితాలు నెగిటివ్‌ రాగా మరికొంత మంది ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. కరోనాను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నమని తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి